కె.కోటపాడు,ఫిబ్రవరి21(ఆంధ్రపత్రిక):
ఈనెల 26న వై.ఎస్.అర్.కాంగ్రెస్ పార్టీ మాడుగుల నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం కె. కోటపాడులో ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు.
మంగళవారం ఇక్కడ స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సిపి రీజినల్ కో-ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గోనున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిథులు, నాయకులు పార్టీ సమీక్ష సమావేశానికి హాజరై విజయవంతం చేయాలనికోరారు. అదేవిధంగా రానున్న పట్టభద్రుల ఎన్నికలో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేసి గెలిపించుకోవాలని డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు అన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డి జగన్ మోహన్ తదితర్లు పాల్గొన్నారు.