హైదరాబాద్: శర్వానంద్ (శర్వానంద్), రీతూ వర్మ (రీతూ వర్మ) నాయకానాయికలుగా రూపొందిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (ఓకే ఒక జీవితం).
అక్కినేని అమల (అక్కినేని అమల) కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెప్టెంబరు 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వీరంతా మీడియా సమావేశంలో పాల్గొని, పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..
”నా మనసుకు హత్తుకున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇందులోని ఏదో ఒక పాత్రకు కనెక్ట్ అవుతారు. మనలో చాలామంది గతం, భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని ఆనందించలేకపోతున్నారు. ఆ ఆలోచనలు లేకపోతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందుకే ఈ సినిమాకి ‘ఒకే ఒక జీవితం’ అనే పేరు పెట్టాం. ఇందులో ఎమోషన్ మాత్రమే కాదు వినోదాత్మక అంశాలూ ఉన్నాయి. ఈ సినిమాని మీరే ముందుకు తీసుకెళ్లాలి. ఈ చిత్రంలో ఓ పాట పాడి, మాకు సపోర్ట్ చేసిన కార్తి (తమిళ హీరో) అన్న, ట్రైలర్ బాగుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రభాస్ అన్న, ట్రైలర్ విడుదల చేసిన అనిరుధ్‌కి థ్యాంక్స్” అని శర్వానంద్ అన్నారు. అనంతరం, ప్రముఖ గేయ రచయిత, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ.. ”ఆయన నాకు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు.
ఆయన ఏదైనా పాటను రాసేందుకు 9 నెలల సమయం తీసుకున్నారంటే ఆ పాట, సినిమా హిట్. ఆయన్ను చాలా మిస్ అవుతున్నా. ఈ చిత్రంలోనూ అమ్మ ప్రేమను చాటిచెప్పే గీతాన్ని రాశారాయన.
”సుమారు పదేళ్ల తర్వాత నేను నటించిన తెలుగు చిత్రమిది. మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు శ్రీ కార్తీక్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి ఎంతో ప్రత్యేకం.
ఈ సినిమాలో నేను శర్వానంద్ తల్లిగా కనిపిస్తా. అలా అని కథ అంతా తల్లీకొడుకుల ప్రేమ గురించి కాదు.. దయచేసి భయపడకండి (నవ్వుతూ..). ఇది ముగ్గురు వ్యక్తుల ప్రయాణానికి సంబంధించిన కథ. చాలా ప్రత్యేకమైంది. థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాను చూడండి. తప్పకుండా మీ అందరి హృదయాలను హత్తుకుంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
”శుక్రవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ కార్తీక్ ఎంతో ప్రేమతో ఈ సినిమాని తెరకెక్కించారు. శర్వా తన పాత్రలో ఒదిగిపోయారు. తెర వెనక ఆయన ఎంత కష్టపడతారో తెలియదుకాని కెమెరా ముందుకు రాగానే ఏ భావోద్వేగాన్నైనా చక్కగా పలికిస్తారు. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని రీతూ వర్మ అన్నారు.
”దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. ముందుగా తమిళంలోనే ఈ కథ రాశా. నిర్మాతలకు వినిపిస్తే.. ‘ఇది చాలా మంచి స్టోరీ. తెలుగులోనూ తీద్దాం’ అని అన్నారు. అలా ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి సంభాషణలు రాశారు. మా అమ్మ తెలుగు ఆవిడే. ఆమె కోసం చేసిన చిత్రమిది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరీ ఇది. స్క్రిప్టు వినగానే శర్వానంద్ నటించేందుకు ఒప్పుకొన్నాడు. ఈ సినిమాతో ఆయన మీ అందరినీ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, జీవితం అంటే ఏంటో తెలియజేస్తాడు. మా సినిమాకి ప్రధాన బలం అమల మేడమ్. ‘పెళ్లిచూపులు’ సినిమాలోని రీతూవర్మ నటనకు నేను ఫిదా అయిపోయా. నేను సినిమా తీస్తే తననే హీరోయిన్గా ఎంపిక చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా” అని శ్రీ కార్తీక్ తెలిపారు.