ఒంగోలు, ఫిబ్రవరి 4 (ఆంధ్రపత్రిక) : క్రూడ్ ఆయిల్ దిగుమతి పది శాతం మరియు ఆయిల్ ధరలు తగ్గుటకు మరియు పట్టణ కాలుష్య నివారణకు వుపయోగపడే ప్రత్యామ్నాయ స్వదేశీ మిథనాల్ ఇంధనం/ఆయిల్, నీతి ఆయోగ్ ప్లాన్ క్రింద, దేశంలో జరిగిన ఉత్పత్తి మరియు దాని పెంపుకు ప్రభుత్వ చర్యల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు అడిగిన ప్రశ్నకు కేంద్ర రసా యనాలు మరియు ఎరువుల శాఖ సహాయక మంత్రి, గౌ. శ్రీ భగ్వంత్ ఖుబా గారు సమాధానమిస్తూ క్రూడ్ ఆయిల్ దిగుమతిపై దేశం అధారపడటాన్ని తగ్గింపుకు మిథనాల్, ఆయిల్, గ్యాస్‌ల దేశీయ ఉత్పత్తి పెంపుదల చేయుటకు, శక్తి సామర్ధ్యాన్ని మరియు పరిరక్షణ చర్యల వృద్దిచేయుటకు, డిమాండుకు తగిన ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయడం, జీవ – ప్రత్యామ్నాయ ఇంధనాలను వృద్ధిచేయడం మరియు శుద్ధి ప్రక్రియ మెరుగుపరచడం వంటి ఇదు అంశాలతో సుదీర్ఘ వ్యూహాన్నిప్రభుత్వం అవలంబించినదని తెలిపారు.
దిగుమతులు తగ్గించుటకు, దేశీయంగా ఆయిల్ – గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి మేరుగుపరచుట, వున్న వాటిని పునాభివృద్ది చేయడం, క్రొత్త వాటిని అభివృద్ధి చేయడం, పనిచేయని బావులు పునరుజ్జీవింప చేయడం మరియు మెరుగైన నూతన పద్దతులను చేపట్టడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం అవలంబించుచున్నదని మరియు 2017-18 నుండి 2021-22 వరకు సరాసరిన 84 శాతం దిగుమతులపై దేశం ఆధారపడినదని కేంద్ర మంత్రిగారు తెలియజేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!