– సంప్రదాయబద్దంగా సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ,
శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి దంపతులు సోమవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు . వీరితో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు, ఈవో శ్రీ సాగర్ బాబు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. దేవాంగుల మండపంలో అర్చకులు శ్రీ ధర్మారెడ్డికి తలపాగా చుట్టి పట్టు వస్త్రాలు తలమీద ఉంచారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న ఈవో దంపతులు, ఇతర ముఖ్యులతో కలసి శ్రీ సోమ స్కంధమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కు పట్టు వస్త్రాలు సమర్పించారు.అనంతరం శ్రీ వాయులింగేశ్వరుడు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, శ్రీ గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ, ప్రసాదాలుఅందించారు. తిరుమల శ్రీవారి ఆలయ పారుపత్తే దారు
శ్రీ ఉమామహేశ్వరరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.