ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 లో బుధవారం (నవంబర్ 1) మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పుణే వేదికగా రెండు బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అమి తుమీ తేల్చుకోనున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్ జట్లు వరుసగా 2,3 స్థానాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు గెలిస్తే అది సెమీఫైనల్ దిశగా మరో బలమైన అడుగు వేస్తుంది
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 లో బుధవారం (నవంబర్ 1) మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పుణే వేదికగా రెండు బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అమి తుమీ తేల్చుకోనున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్ జట్లు వరుసగా 2,3 స్థానాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు గెలిస్తే అది సెమీఫైనల్ దిశగా మరో బలమైన అడుగు వేస్తుంది. అదే సమయంలో ఓడిన జట్టుకు సెమీస్ లెక్కల్లో భారీ దెబ్బ తగులుతుంది. ముఖ్యంగా వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కి కూడా ఆ జట్టు కెప్టెన్ కేన్విలియమ్సన్ దూరం కానున్నాడు. గాయంతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
పిచ్ రిపోర్డు ఇదే..
2023 ప్రపంచకప్‌లో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని పిచ్‌పై మొత్తం రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదే మైదానంలో అఫ్గానిస్థాన్ 7 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో పుణెలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. పూణె పిచ్‌పై ఫాస్ట్ బౌలర్ల సహకారం పుష్కలంగా ఉంటుంది. అలాగే పిచ్‌పై బౌన్స్ కూడా బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బంతిని ఎదుర్కొనేందుకు బ్యాటర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక సాయంత్రం పూట రెండోఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది. ఒక వేళ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థికి 350కి పైగా లక్ష్యాన్నివిధించాలి.
పూణే వాతావరణ నివేదిక
నవంబర్ 1న పూణేలో వాతావరణం పూర్తిగా స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం చాలా తక్కువ. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు , కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.
గత రికార్డులివే..
న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 71 వన్డేల్లో న్యూజిలాండ్ 25, దక్షిణాఫ్రికా 41 విజయాలు సాధించాయి. ఇక తటస్థ వేదికలపై జరిగిన 20 వన్డేల్లో న్యూజిలాండ్ 8 మ్యాచ్‌లు గెలుపొందగా, దక్షిణాఫ్రికా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మిగతా 5 మ్యాచుల్లో ఫలితం తేల లేదు.
న్యూజిలాండ్ జట్టు:
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, ఇష్ సోధీ, మార్క్ చాప్మన్
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, తబ్రిజ్ షమ్సీ, రీజా హెండ్రిక్స్, కాగిలే రసోబాడా ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్.