డిసెంబర్ 26 (ఆంధ్రపత్రిక): యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నెలల తరబడి షూటింగ్.. ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలతో అలసి పోయిన ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్ అయినా కూడా ఇప్పటి వరకు షూటింగ్ మొదలు అవ్వలేదు. గత కొన్ని రోజులుగా అమెరికాలో భార్య పిల్లలతో సరదాగా గడుపుతున్న ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ప్రమోషన్ పోస్ట్ అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్‌కు నచ్చి పోస్ట్ చేసి ఉండవచ్చు అంటున్నారు.న్యూ జెర్సీలో ఉన్న మన ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లిన సందర్బంగా కిచెన్‌లో సందడి చేశాడి అంటున్నారు. అక్కడ ఫుడ్‌ను ఆస్వాదించాను అంటూ సోషల్ విూడియా ద్వారా చెప్పుకొచ్చాడు. విదేశీ పర్యటనలో ఉన్న ఇండియన్స్‌కు ఇంత కంటే బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ లభించదు అన్నట్లుగా కామెంట్స్ చేశాడు. జునూన్ అనే ఆ రెస్టారెంట్ లో ఆహారం చాలా అద్భుతంగా ఉంది అన్నట్లుగా ఎన్టీఆర్ ప్రశంసించాడు. అంతే కాకుండా అక్కడి వారితో వంటశాలలో ఫొటో దిగి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఎన్టీఆర్ ఇన్‌స్టా పోస్ట్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఆయన ఏం షేర్ చేసినా కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఫొటోలో ఎన్టీఆర్ లుక్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ గడ్డం,విూసాలాతో పాటు ఆయన డ్రస్సింగ్ స్టైల్ చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!