విశాఖపట్టణం,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): వైకాపా మూడేళ్ల పాలనలో ప్రజలకు,రాష్టాన్రికి ఒరిగిందేవిూ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాష్టాన్రికి చేసింది ఏవిూ లేదని కూడా అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కుటుంబ డాక్టర్ పథకం పేరుతో ఆగస్ట్ 15న.. కొత్త పథకాన్ని శ్రీకారం చేస్తామని ఇచ్చిన హావిూ ఏమైందని ప్రశ్నించారు. అవగాహన లేని పథకాలను అమలు చేస్తామని నమ్మించడం తగదన్నారు. మద్యం తాగితేనే పథకాలు అమలవుతాయన్నట్లు జగన్ రెడ్డి పాలన ఉందని విమర్శించారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ విశ్వసనీయత నేడు ఏమైందని నిలదీశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జగన్ పలికినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు. అందుకే ప్రతిపక్షాలపై, విూడియాపై దుర్భాషలకు దిగారన్నారు. జగన్ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను జనం నమ్మే స్థితిలో లేరన్న ఆయన సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇసుక రద్దుతో భవన కార్మికులను రోడ్డున పడేసి ఉద్ధరించినట్లు మాట్లాడారని మండిపడ్డారు. జగన్ ప్రమాణస్వీకారం రోజున పెన్షన్ రూ.3వేలు చేస్తానని సంతకం పెట్టిన ఫైల్‌కు నేడు దిక్కులేదని దుయ్యబట్టారు. 3, 4, 5వ తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంతో విద్యార్థులు కాలువలు, చెరువులు, శ్మశానాలు దాటి స్కూళ్లకు వెళ్లాల్సివస్తోందని అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!