నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజయవాడ అర్బన్ &NTR జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ విజయవాడ నందు నిర్వహించిన ఉపాధ్యాయ సేవా పురస్కారాలు విజయవంతం అయ్యాయి. ఉపాధ్యాయ పురస్కార సభకు విజయవాడ అర్బన్ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రొంగలి గణపతి రావు(గణేష్) అధ్యక్షత వహించగా ప్రథాన కార్యదర్శి యాసం వి వి చంటి బాబు స్వాగతం పలుకగా, ఆర్ధిక కార్యదర్శి బి చంద్రశేఖర్ వందన సమర్పణ చేశారు.సభకు ముఖ్య అతిథిలుగా హాజరైన పూర్వపు జె ఏ సి ఛైర్మెన్ శ్రీ పర్చూరి అశోక్ బాబుMLC , శ్రీమతి సి వి రేణుక DEO NTR జిల్లా హాజరయ్యారు. వారితో పాటు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అప్పారావు మూకల, నడిపినేని వెంకట్రావు లు, ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస రావు ,DCEB సెక్రటరీ షేక్ ఉమర్ అలీ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బి హైమారావు, జయహో ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడు జె శ్రీనివాసరావు, రాష్ట్రఅదనపు ప్రధాన కార్యదర్శి శ్రీమతి చుండి పద్మావతి ,NTR జిల్లా అధ్యక్షుడు బి వి యన్ సోమ సుందర రావు, రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ షేక్ ముజాయుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.
తొలుత మాట్లాడిన మహిళా నాయకురాలు శ్రీమతి చుండి పద్మావతి నేటి యాప్ ల బాధను ఏకరవు పెట్టారు.ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ మార్గ దర్శకాలు బట్టి పనిచేస్తామని కాని వింత ధోరణిలో మన చరవాణి తో ముఖ హాజరు యాప్ లో హాజరు నమోదు తీవ్రమైనదని ఆ పనికి ప్రభుత్వమే పరికరాలు అందజేయాలని కోరారు.రాష్ట్ర బాధ్యులు వెంకట్రావు, హైమారావు మాట్లాడుతూ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు సరికాదని బి ఆర్ టి యస్ రోడ్ ఎక్కినందుకు ఉపాధ్యాయులను దోషులుగా చూడటం భావ్యం కాదన్నారు. హెచ్ యం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కోవిడ్ అనంతరం ఉపాధ్యాయులను సత్కరించే మంచి కార్యక్రమం చేపట్టిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ను అభినందించారు. వివిధ సమస్యలపై అనేక దఫాలు చర్చలు జరుపుతున్నప్పటికి పాలకుల నుండి సానుకూలత కనబడటం లేదని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒకే తాటి పైకి వచ్చి ప్రభుత్వం విద్యా వ్యవస్థకు నష్టం చేసే చర్యలను నేను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందని అన్నారు. నేటి ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను అభినందించారు.
NTR జిల్లా DEO శ్రీమతి సి వి రేణుక మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ను అభినందించారు. విద్యా వ్యవస్థ లో వస్తున్న నూతన టెక్నాలజీ ను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలని, ప్రతి ఉపాద్యాయుడు విద్యార్థిని అహర్నిశలు తీర్చి దిద్దడానికి కార్యోన్ముఖుడై ఉండాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు నూరు శాతం న్యాయం చేయాలని అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కాలక్రమంలో తొలగిపోతాయని అన్నారు.100%రిజల్ట్ సాధించిన సయద్ నూరిద్దీన్ నగర పాలక సంస్థ ఉర్దూ అప్గ్రేడ్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని,ఉపాధ్యాయులను DEO శ్రీమతి సి వి రేణుక,MLC పర్చూరి అశోక్ బాబు, సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. తదుపరి రాజస్థానీ హిందీ మీడియం 100% యస్ యం ఏ ఖుర్ధుస్ నగర పాలక సంస్థ ఉర్దూ ఉన్నత పాఠశాల హెం యం షేక్ నజ్రీన్ మరియు ఉపాధ్యాయులను సత్కరించారు. నగరంలో రెండు మాధ్యమాలలో మొదటి స్థానం పొందిన వి యం రంగా బాలికల ఉన్నత పాఠశాల కృష్ణలంక HM శ్రీమతి గ్రేసమ్మ,ఉపాధ్యాయులు, రెండో స్థానం పొందిన జి డి ఇ టి పడమట యం శ్రీనివాస రావు ఉపాధ్యాయులు, మూడో స్థానం పొందిన శ్రీ బి వి సుబ్బారెడ్డి నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తదుపరి సీనియర్ హెచ్ యం లు యం నాగ లింగేశ్వర రావు, సి హెచ్ సుబ్రమణ్యం గార్లను రిటైర్ SA సోషల్ జోషి మేరి గారిని సత్కరించి వెబెక్స్ మీటింగ్ ఉన్నందున నిష్క్రమించారు.
నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు మూకల మాట్లాడుతూ గత 20యేళ్ళుగా ఉపాధ్యాయులను సత్కరించుకుంటున్నామని కాని కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా సత్కారాలు నిలిపివేశామని నూతనముగా ఏర్పాటుయైన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరల ఉపాధ్యాయులను సత్కరించుట దానికి ఎన్నో పనులున్నా సమయం కేటాయించిన DEO మేడం గారికి, మన మెంటార్ MLC అశోక్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయ హక్కులతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందని అన్నారు.
ముఖ్య అతిథి శ్రీ పర్చూరి అశోక్ బాబు MLC ఉద్యమ అనుభవమంతా రంగరించి అధ్భుతమైన సందేశం ఇచ్చారు. నేటి ఉద్యమాల తీరును తూర్పారబట్టారు.నాయకులు పటుత్వం కోల్పోయారని కనీసం కేడర్ నాయకులను నిలదీయక పోవడం శోచనీయం అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఓ తటస్థ సంఘంగా ఉద్యమ పంధాలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా రాజీ లేని పోరాటం చేయాలనీ అన్నారు.అందుకే పార్టీ పేరుతో ఉన్న తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ను రద్దు చేయడానికి రిజిస్ట్రేషన్ సంభందించిన సాంకేతిక ఇబ్బందులు వలన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రిజిష్టర్ చేశామని చెప్పారు. నేడు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నిర్మాణం లో చురుకుగా ఉందని ఇంకా చురుకుగా పని చేసి రాష్ట్రమంతా ఇస్తరించాలని కోరారు.లేని TNUS పేరుతో కొంత మంది హాల్ చల్ చేస్తున్నారని వారు కూడా రియలైజ్ అయ్యే రోజు త్వరలోనే ఉందని వారి గురించి పట్టించుకోకుండా నిర్మాణము చేయాలి అన్నారు. దాదాపు 250మంది పైగా ఉపాధ్యాయులను సత్కరించడం ఈ సంఘం అనతికాలంలో సాధించిన ఘనత అని దీన్ని నిలబెట్టు కుంటూ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని అన్నారు. అనేక ఉద్యోగ సమస్యలు వాటి తీరుతెన్నులు నాయకత్వ అలసత్వ ధోరణి ల పై గళం వినిపించారు. హాజరైన ఉపాధ్యాయులు చాలా శ్రద్ధగా అశోక్ గారి ఉత్తేజ పూరిత ప్రసంగాన్ని మంత్ర ముగ్ధులై ఆలకించారు. తదుపరి 100%ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు, సబ్జెక్ట్ లో 100మార్కులు సాధినించిన ఉపాధ్యాయులకు కోవిడ్ సేవలు అందించిన హెచ్ యం లు, పిఈటి, పిడి లు,NCC ఆఫీసర్ లు స్కూల్ సూపర్వైజర్ లు, ప్రైమరీ హెచ్ యం లకు మెమెంటో, టీచర్ డైరీ, దుచ్చాలువ తో ఘన సన్మానం జరిగింది.సన్మానాలు ముగిసిన తరువాత షడ్రుషోపేతమైన విందుతో సమావేశం ముగిసింది.