పవన్ కల్యాణ్
విజయవాడ,అక్టోబర్ 18 (ఆంధ్రపత్రిక): వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెబ్బులిలా గాండ్రిరచారు. దాడులు చేసి వారిపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించారు. ప్యాకేజీ స్టార్ అనే వెధవల్ని చెప్పుతో కొడతానని చెప్పు చూపించి మరీ పవన్ హెచ్చరించారు. ప్యాకేజీ అనే సన్నాసుల్లారా మెడ పిసికి చంపేస్తానని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది మా సహనం అని, మమ్మల్ని తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తానని పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సహనాన్ని అలుసుగా తీసుకుంటే గట్టిగానే సమాధానం చెబుతామన్నారు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానంటున్నారని, ’విూరూ చేసుకోండ్రా.. ఎవడొద్దన్నారు?’ అని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఒరెయ్ వెధవల్లారా నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే విూకెందుకురా? విూలా ఒక పెళ్ళి చేసుకుని 30 స్టెఫ్నీలతో తిరగడం లేదు’ అని జనసేనాని విరుచుకుపడ్డారు. ’ఒంటి చేత్తో మెడ పిసికి చంపేస్తా నా కొడకల్లారా’ అని పవన్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ’లండన్, న్యూయార్క్లో పెరిగాననుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా’ అని పవన్ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒంగోలు గోపాలనగరంలో వీధి బడిలో చదివానని పవన్ చెప్పారు. ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానని పవన్ నిప్పులు చెరిగారు. ’వైసీపీతో నేను యుద్దానికి సిద్ధం.. రాడ్లతోనా.. హాకీ స్టిక్కులతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం.. నేటి నుంచి యుద్ధమే.. విూరు రెడీనా’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సై అంటే సై అన్నారు. ఈ రకంగా వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ’ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసుల్లారా పిసికి చంపేస్తా.. చెప్పుతో కొడతా నా కొడకల్లారా. విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే విూరా నాకు చెప్పేది’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ చేసేది అవకాశవాద రాజకీయమని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈరోజు నుంచి యుద్దమేనని అన్నారు. ఎంతమంది వైసీపీ గుండాలు వస్తారో రండి. ’రాళ్లా..? కర్రలా..? హకీ స్టిక్కులా..? రండిరా కొడకల్లారా’ చూసుకుందాంటూ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. గత 8 సంవత్సరాల కాలంలో తాను 6 సినిమాలు చేశానని.. దాదాపు 100 నుంచి 120 కోట్లు సంపాదిం చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిల్లల ఎఫ్డీ నుంచి డబ్బులు విత్డ్రా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించానని.. సీఎం ఫండ్, ఇతర సేవా కార్యక్రమాలకు రూ. 12 కోట్లు ఇచ్చానని.. అయోధ్య రామాలయానికి రూ. 33 లక్షలు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ’నేను వాహనం కొంటే.. అది గిప్ట్ ఇచ్చారని అంటారా.. దానికి జీఎస్టీ కూడా కట్టాను. ఎదవల్లారా నా సంపాదన ఎంతో విూకు తెలుసా’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారని.. ఇకపై మరో రూపం చూస్తారని జనసేనాని ధ్వజమెత్తారు. తనకు రాజకీయం తెలియదన్న వైసీపీకి రాజకీయం ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బూతుల పంచాంగం చెప్పే ప్రతీ వైసీపీ నేతకు ఇదే నా వార్నింగ్’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వైసీపీ నేతలంతా చెడ్డవాళ్లు కాదని.. బాలినేని లాంటి మంచివారూ ఆ పార్టీలో ఉన్నారని.. ఆయనకు థ్యాంక్స్ అని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతీ ఒక్కరికి భావస్వేచ్చ ప్రకటన ఉందని.. మాట్లాడొచ్చునని డీజీపీ అన్నారన్న పవన్ కళ్యాణ్.. భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చతోనే తాను మాట్లాడుతున్నానని అన్నారు. అలాగే తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరమన్న పవన్? అక్కడ ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో? రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో క్యాడర్ను దిశానిర్దేశర చేశారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. తెలంగాణలో కనిపించిన ఐక్యత ఇక్కడి నేతల్లో ఎందుకు కనిపించడం లేదన్నారు