మచిలీపట్నం సెప్టెంబర్ 23 ఆంధ్రపత్రిక.
వక్కలంక వెంకట రామకృష్ణ ,స్టాఫ్ రిపోర్టర్.
భద్రత, భవిత పాత పెన్షన్ విధానంలోనే ఉన్నాయని, సి.పి.ఎస్., జి.పి.ఎస్. మాకొద్దు, ఒ.పి.ఎస్. ఏ ముద్దు అని ఉద్యోగ, ఉపాద్యాయులు ఎలుగెత్తి చాటు తున్నారు. దాదాపు 30 సంవత్సరాలు పైగా ప్రభుత్వ సర్వీస్ చేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జి.పి.ఎస్. గొడ్డలి పెట్టు అని ఫ్యాఫ్టో ఉపాధ్యాయ సంఘాలు , ఉద్యోగులు నినదిస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తాసిల్దార్ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాత పెన్షన్ పునరుద్దరణ తమ ఏకైక లక్ష్యం అని ఏ.పి.టి.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగ రాజు, యుటిఎఫ్ నాయకులు లెనిన్ బాబు అన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలో సి .పి.ఎస్. ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్ద పీట వేసి ఓ.పి.ఎస్. అమలు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఎమ్మెల్యే /ఎం.పి. ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినా పెన్షన్ విధానం అమలవుతోందని, 30 సంవత్సరాలు పైగా సర్వీస్ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు 2004 నుండి పాత పెన్షన్ స్కీం అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది ఇలా ఉండగా ఏ.పి.సి.పి.ఎస్. ఉద్యోగ సంఘం, ఏ.పి.ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) ఏక తాటి పైకి వచ్చాయి. శుక్ర, శని వారాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో జి.పి.ఎస్. కి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాద్యాయులు నిరసనలు జరిపారు. సి.పి.ఎస్/జి.పి.ఎస్. పరిధిలోకి వచ్చే ఉద్యోగ , ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి. విధులకు హాజరయ్యారు. సి.పి.ఎస్/ జి.పి. ఎస్. కి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ,ఉపాద్యాయులు కదం తొక్కారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు మాత్రమే కాక తహశీల్దార్ కార్యాలయాల్లో సైతం రెవెన్యూ ఉద్యోగులు,గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు జి.పి.ఎస్. వద్దు ఓ.పి.ఎస్. ముద్దు అంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ లు ధరించి విధులకు హాజరయ్యారు. 25 వ తేదీ చలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతం చేయాలని ఫ్యాఫ్టో నాయకులు, ఉద్యోగ సంఘాలు పిలుపు నిచ్చాయి. ఓ.పి.ఎస్. కి బదులు జి.పి.ఎస్ అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలపడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమే అని ఫ్యాఫ్టో నాయకులు లంకేశ్ బాబు, లెనిన్ బాబు, రాజేష్, లంకేశ్ తదితరులు అన్నారు.ప్రభుత్వం పునారాలోచించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. మోసపూరిత మైన జి.పి.ఎస్. విధానంతో రాష్ట్రంలోని నాలుగు లక్షలకు మందికి పైగా ఉన్న సి.పి.ఎస్. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్యాయం చేయడం తగదని ఏ .పి. సి.పి.ఎస్. ఈ. ఏ. రాష్ట్ర అధ్యక్షులు రొంగలి అప్పల రాజు అన్నారు. జి.పి.ఎస్. వద్దు, ఓ.పి.ఎస్. ముద్దు.. మా పెన్షన్ కే మా ఓటు అని నినదించారు. భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాద్యాయులు నిరసన చేపట్టారు. ఏ.పి. సి.పి.ఎస్.ఈ. ఏ. ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు కె.రామ్ ప్రసాద్ పలు పాఠశాలలకు కార్యాలయాలకు వెళ్లి సంఘీభావం తెలిపారు. 2 ఏ .పి.టి. ఎఫ్. సంఘాలు, ఎస్.టి.యు. యు.టి.ఎఫ్. బి.టి.ఏ. ప్రధానోపాధ్యాయులు సంఘాలు, ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మండల తాసిల్దార్ కార్యాలయ కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాత పెన్షన్ విధానమే ముద్దు ,జి.పి. ఎస్. వద్దు అంటూ నినదించారు. ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఏ.పి.టి. ఎఫ్.పక్షాన తమ్ము నాగ రాజు, లంకేష్ బాబు, యు.టి. ఎఫ్. పక్షాన జే. లెనిన్ బాబు, ఉమా మహేశ్వర రావు, రంగనాథ్, ఎస్.టి.యు
నాయకులు కే.మాధవ రావు, ఎం.ఎస్. ఎన్.ప్రసాద్, కొమ్ము ప్రసాద్, ఏ.పి.టి. ఎఫ్.నాయకులు నడకుది టి రామబ్రహ్మం, వి.సాంబశివ రావు, బి.టి. ఏ.నాయకులు రాజేష్, కైతేపల్లి దాసు , తదితర నాయకులు ఆయా మండల తాసిల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. బందరు తాసిల్దారు కార్యాలయం వద్ద ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వం సిపిఎస్/ జిపిఎస్ రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.పాత పెన్షన్ విధానానికి తామంతా కట్టుబడి ఉన్నామన్నారు.