వందలకోట్ల సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్లో కొత్త వ్యాపారానికి తెరతీస్తోంది. ఈ బియ్యాన్ని తినడానికి ఎవరు కూడా ముందుకు రావడంలేదు. చాలాప్రాంతాల్లో సబ్సిడీ బియ్యం పొందు తున్న వారు నేరుగా అమ్మేసుకుంటున్నారు. పలు పథకాలకు కార్డు కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ దీనిని పొందేందుకు తంటాలు పడుతున్నారు. ఇకపోతే తెలంగాణలో కళ్యాణలక్ష్మి, డబుల్ ఇళ్లకు కార్డులే కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే దుబరా, దుర్వినియోగం పై అధికారులు ఎలాంటిచర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా పథకాలు అర్హులకు చేరుతున్నాయో లేదా అన్న ఆడిట్ కూడా జరగడం లేదు. అందుకే ప్రజలు కూడా ఉచితంగా ఏది వస్తేఅది తీసుకోవాలన్న దానిపై శ్రద్ద చూపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కంటే ఇతరత్రా ప్రయోజనాలను పొందేందుకు ప్రధానంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు పొందడానికి కార్డులు మంజూరు చేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన రేషన్ కార్డులను మంజూరుచేయడంతో పాటు ఉన్న వాటిలో అవసరమైన వాటిలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఆహార భద్రత కార్డు రేషన్ బియ్యం, తదితర వస్తువులు తీసుకు నేందుకు, ప్రభుత్వ పరంగా సబ్సిడీ పథకాల ద్వారా లబ్ది పొందేందుకు. వివిధ రకాల రుణాలను పొందేం దుకు, ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ మేరకు ఇప్పటివరకు రేషన్ కార్డు లేని వాళ్లు,ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడి జీవిస్తున్న వాళ్లతో పాటు పెళ్లిళ్లు జరగడం వల్ల అత్తగారిం టికి వెళ్లిన వారి పేర్లను తొలగించడంతో పాటు కోడళ్లుగా వచ్చినవారి పేర్లను నమోదు చేసేందుకు విూ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో పేదవాళ్లకు కడుపు నిండా తిండి పెట్టేందుకు ఉద్దేశించిన ఆహార భద్రత కార్డుల మంజూరు పక్రియలో మళ్లీ వెనకడుగు పడిరది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇంకా అనేకులు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నా అందడం లేదన్న ఆందోళన ఉంది. అలాగే కార్డులు లేకపోవడంతో తమకు రేషన్ ఆవడం లేదుని పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పేదల పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికం కావడంతో దీనికోసం వారంతా ఎదురు చూస్తున్నారు. కార్డులు ఎప్పుడు జారీచేస్తారా అని వాకబు చేస్తున్నారు. కలసిన నాయకుడిని, అధికానిని పట్టుకుని అడుగుతున్నారు. ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమాధానం దొరకడం లేదు. తమ దరఖాస్తులు ఏం చేస్తారని అధికారు లను నిలదీస్తున్నారు. దీంతో అసలు తమకు కార్డు వస్తుందా రాదా అని బెంగ పెట్టుకున్నారు. మరోవైపు కార్డు ఉన్నవారు సకల సౌకర్యాలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అమలు కార్డులే కీలకం కావడంతో రాని వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ కోసం అనేకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ వైద్యం కోసం సిఎం సహాయనిధికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో సకాలంలో వైద్యంకూడా అందడం లేదు. రేషన్ కార్డుల ద్వారా వచ్చే సబ్సిడీ బియ్యంతో పాటు విలువైన ఆరోగ్యశ్రీ కార్డులను పొందలేని పరిస్థితి ఏర్పడిరది. అనారోగ్యం బారినపడిన వాళ్లు వ్యాధులను నయం చేసుకు నేందుకు వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తున్నది. కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు మండల తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.రేషన్ కార్డుల మంజూరు నిరంతర పక్రియ అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పది మాసాలుగా కార్డులు మంజూరు చేయకపోవడమే గాకుండా మార్పులు కూడా చేయడం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం, మార్పులుచేర్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు పెండిరగులో ఉన్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రేషన్ కార్డుల మంజూరులో అవకతవక లు జరిగాయని, అనేక బోగస్ కార్డులున్నాయని ప్రకటించిన ప్రభుత్వం పాత కార్డులను రద్దుచేసి కొత్తగా దరఖాస్తులను స్వీకరించి కార్డులను మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ మేరకు కొద్ది రోజుల పాటు కొత్త కార్డుల మంజూరును నిలిపి వేసిన ప్పటికీ, కోడ్ ముగియగానే తిరిగి మంజూరు చేశారు. ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు పక్రియను తాత్కాలికంగా నిలిపి వేయడంతో కొత్తవి మంజూరు కావడం లేదు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని తెలుస్తున్నది. లబ్దిదారులు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే రూపాయి కిలో చొప్పున 6 కిలోల బియ్యం తీసుకుంటున్నారు. కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేసినట్లయితే మరికొంత మందికి ప్రయోజనం కలగనున్నది. బియ్యం పథకంపై ప్రజల్లో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. తక్షణం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని నిజమైన పేదలకు కార్డులు అందించాలి. అలాగే బోగస్ కార్డులను ఏరేయాలి. అలాగే సబ్సిడీ పథకాలు దుర్విని యోగం కాకుండా చూడాలి. గ్రామాల్లో పథకాలను పక్కాగా అమలు చేస్తే వేలకోట్లు ఆదా చేసుకోవచ్చు. అందుకు సిఎం కెసిఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని కార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!