దేశంలో మరోసారి నిపా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేరళలోని నిపా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. దీంతో కరళలోని వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటంబ సభ్యులను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి చేర్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంలో అందరిని వణికించిన నిపా వైరస్.. మళ్లీ కేరళలో ప్రబలుతుతోంది. నిపా వైరస్ సోకడం వల్ల ఇన్ఫెక్షన్ రావడంతో కోజికోడ్ జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
దేశంలో మరోసారి నిపా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేరళలోని నిపా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. దీంతో కరళలోని వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటంబ సభ్యులను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి చేర్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంలో అందరిని వణికించిన నిపా వైరస్.. మళ్లీ కేరళలో ప్రబలుతుతోంది. నిపా వైరస్ సోకడం వల్ల ఇన్ఫెక్షన్ రావడంతో కోజికోడ్ జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం నిర్వహించి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై సమీక్ష చేశారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని నిపా వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..208,2021లో కూడా కోజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ వల్ల పలువురు మృతి చెందారు.
ఈ నిపా వైరల్ అనేది భారత్‌లో 2001లో మొదటిసారిగా.. బెంగాల్‌లోని సిలిగురి అనే ప్రాంతంలో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ 2007వ సంవత్సరంలో కేరళలో కనిపించింది. వాస్తవానికి ఈ నిపా వైరస్ ముందుగా మెదడుకు ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది, ఆ తర్వాత మెదడువాపునకు కారణమవుతుంది. అందుకోసమే.. దీన్ని ఒకరకం మెదడువాపుగా కూడా భావించారు. ఒక్కసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించాక.. సగటున తొమ్మిది రోజుల్లో.. నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మెదడువాపు కారణంగా తలనొప్పి వస్తుంది. దీంతో తీవ్రమైన తలనొప్పి వల్ల కొంతమందిలో 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి దారి తీయవచ్చు. అయితే ఈ వైరస్ సోకిన వారిలోజ్వరం, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. అలాగే శరీరంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే.. మూర్ఛ, ప్రవర్తనలో మార్పులు కూడా కనిపిస్తాయి.
మెడ బిగుసుపోవడం, వెలుగును చూడలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌లో ఊపిరి కూడా అందకపోవచ్చు. మరో విషయం ఏంటంటే గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్కు దారి తీసే అవకాశం ఉంటుంది. మరోవిషయం ఏంటంటే అరుదుగా కొంతమందిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా మరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ఎన్ఐవీ అని అంటారు. ఇదిమలేషియాలోని కాంపంగ్ షుంగై నిపా అనే ప్రాంతంలో 1998లో వ్యాపించడంతో ఈ వైరస్‌కు ఆ ప్రదేశం పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ వైరస్ బంగ్లాదేశ్, భారత్‌లో వెలుగుచూసింది. అయితే ఈ నిపా వైరస్ అనేది ఫ్రూట్ బ్యాట్ అనే రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది.