గుంటూరు సెప్టెంబర్ 09 ( ఆంధ్రపత్రిక ): గుంటూరు రింగ్ రోడ్డు లోని సిద్ధార్థ గార్డెన్స్ నందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వివిధ రంగాల ప్రముఖులు, నగర ప్రముఖులు వెంకయ్యనాయుడుని కలిసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు గతంలో పత్రికలు, విద్య, వైద్యం ఓ మిషన్ కోసం నడిచేవి, ఇప్పుడు కమిషన్ కోసం నడుస్తున్నట్లుగా ఉంది అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం పత్రిక రంగం పనిచేయాలని సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో తన స్వార్థం కోసం ధనాపేక్ష లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని ఆయన అన్నారు. సెప్టెంబర్ 9 ఆంధ్రపత్రిక ఆవిర్భావ దినోత్సవం అని స్వాతంత్ర ఉద్యమ సాధనలో ఆంధ్రపత్రిక చేసిన కృషి నేటికీ మరువలేనిది ఒక నిర్దిష్ట ప్రమాణాలతో ఒక విలువలతో సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక కథనాలతో ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేక పాత్రహించి స్వతంత్ర ఉద్యమానికి తోడ్పాటునందించి స్వతంత్ర ఉద్యమ సాధనకు కృషి చేసిన ఏకైక పత్రిక ఆంధ్రపత్రిక మాత్రమేనని అన్నారు.
ఆంధ్రపత్రిక ఆవిర్భావం ఆ నాటికి సాహసం అన్నారు. పత్రికలు ప్రమాణాలతో పనిచేయాలి తప్ప ప్రయోజనాల కోసం చేయకూడదు ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికలు నడుపుతున్నారు. ఆ విధానం మారాలి సమాజ శ్రేయస్సు కోసం సమాజ అభివృద్ధి కోసం పత్రికల పని చేయాలి తప్ప రాజకీయ స్వార్థం కోసం స్వలాభం కోసం పత్రికలు పని చేయకూడదని ఇటువంటి విధానానికి స్వస్తి పలికి పత్రిక రంగం ప్రమాణాలతో పనిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటే నాకిష్టం అని ఉప రాష్ట్రపతిగా ఉన్నా చాలా ఆంక్షలు పక్కన పెట్టి దేశం మొత్తం తిరిగాను పదవి నుంచి దిగాక గతంలో మాదిరిగా నేను నాకిష్టమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరి పైనా ఉంది.
రాజ్యాంగానికి లోబడి ప్రజలందరూ నడుచుకోవాలి అని సూచించారు. చట్ట సభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదు అని చట్టసభల లో హుందాగా వ్యవహరించి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేందుకు కృషి చేయాలి అన్నారు. శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పరిధులు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. చట్ట సభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఏం జరిగుతుందని ప్రపంచమఅంతా చూస్తుంది. చట్ట సభల్లో మాట్లాడే భాష సభ్యత, సంస్కారంతో ఉండాలి భాష హుందాతనంగా ఉండాలి. దుర్భాషలు వద్దు అన్నారు. రాజ్పథ్ ను కర్తవ్యపథ్ గా ప్రధాని మార్చారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరించారు. స్వతంత్రంకోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ప్రముఖులే గాంధీ ముందుండి నడిపీనా మిగతా వారి పాత్ర తక్కువ కాదు చాలామంది పోరాట యోధులకు దక్కాల్సిన గుర్తింపు రాలేదు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి, మన భాషను మనం గౌరవించుకోవాలి ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలో మాట్లాడుకోవాలి. ముక్యంగా పరిపాలన తెలుగులో ఉండాలి. ఇంగ్లీషు మీడియం వద్దని ఎవరూ చెప్పరు, ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉన్నత స్థాయికి వస్తారనే అభిప్రాయం తప్పు. మాతృభాషలో చదివిన చాలా మంది దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు ప్రధాని మోడీ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణ నేను ఊర్లలో మాతృభాషలో చదువుకున్న వాళ్ళమే మాతృభాషలో చదవాలి, ఇంగ్లీషు, హిందీతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలి నా జీవితంలో స్నేహ సంపద, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం వల్లే ఈ స్థాయికి వచ్చాను కుటుంబ వ్యవస్థ, సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ నన్ను నిలబెట్టాయి అని అన్నారు.