
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్‌లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన ‘ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE-400 CE’ ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది.
భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్‌లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని ‘బుద్ధుని భూమి’ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం.