ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమిస్తాం
సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తాం
ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం
ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుం
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
జగ్గంపేట:ఫిబ్రవరి16(ఆంధ్రపత్రిక): తెదేపాలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడిరచారు.ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమిస్తామని చెప్పారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తెదేపా అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని.. ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జ్లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!