న్యూ ఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.వాట్సాప్‌ను వాడుతున్నది నిజంగా మీరేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.
మూడు సెక్యూరిటీ ఫీచర్లు
అకౌంట్ ప్రొటెక్ట్ (ఖాతా ప్రొటెక్ట్), డివైజ్ వెరిఫికేషన్ (డివైస్ వెరిఫికేషన్), ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్‌లు (ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్‌లు) అని పిలిచే ఈ మూడు ఫీచర్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంటాయి. యూజర్ల ప్రైవసీ, భద్రత మరింత మెరుగు పడుతందని కంపెనీ.
అకౌంట్ ప్రొటెక్ట్
పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్‌కు వాట్సాప్ అకౌంట్‌ను మార్చేటప్పుడు యూజర్‌లకు ఓల్డ్ అకౌంట్‌లో ఎలాంటి హెచ్చరికలు కనిపించవు దీనితో రియల్ యూజర్ స్థానంలో మరొకరు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రొటెక్ట్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని ప్రకారం వెరిఫై చేస్తే లేదా కొత్త మొబైల్‌లో సంబంధిత నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ చేయడం కుదరదు.
ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్‌లు
వినియోగదారులు తమ మెసేజ్‌లు పంపే అవతలి వ్యక్తికి సురక్షితమైన కనెక్షన్‌లు ఉన్నాయో లేదో నిర్ధారించండి. ఎన్క్రిప్షన్ ట్యాబ్‌లో, చాట్ సురక్షితంగా ఉన్నదీ, లేనిదీ వెరిఫై చేసుకోవచ్చు.
డివైజ్ వెరిఫికేషన్
ఇక మూడవది డివైజ్ వెరిఫికేషన్. యూజర్ల ప్రైవసీ,సెక్యూరిటీ ప్రమాదంలో పడకుండా రక్షించే అదనపు భద్రతా ఫీచర్ ఇది. యూజర్ల అకౌంట్‌ను అథెంటికేట్ చేయడానికి, డివైజ్‌లోకి మాల్వేర్ చొరబడితే అకౌంట్‌ను రక్షించడానికి అదనపు భద్రతా చర్యలను వాట్సాప్ పరిచయం చేసింది. వినియోగదారులతో సంబంధం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో తమంతటమాల్వేర్జాడలను తనిఖీ చేస్తుంది. వాట్సాప్ తన వినియోగదారుల టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనెబుల్ చేసుకోవాలని కూడా సూచించింది.