ఇక్కడి ప్రజలలో ఎక్కువ శాతం మంది రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణాలు అత్యంత చౌకైనవి మరియు సౌకర్యవంతమైనవి. ప్రతి సంవత్సరం రైల్వేస్టేషన్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ప్రకటిస్తుంది. ఇక, ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఎక్కువ ఆదాయం పొందిన 100 రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక, రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ ఉండగా, చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వేస్టేషన్ మూడో స్థానంలో ఉంది. ఇక నాలుగో స్థానంలో సికింద్రాబాద్ స్టేషన్ ఉందని రైల్వేశాఖ వివరించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి సంవత్సరం భారతీయ రైల్వేకు రూ.3,337 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంపాదన విషయంలో ఈ రైల్వే స్టేషన్ నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, కలకత్తా హౌరా రైల్వే స్టేషన్ కు రూ.1,692 కోట్ల వార్షిక ఆదాయం వచ్చింది. మూడోస్థానంలో నిలిచిన చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్ల ఆదాయం వచ్చింది. నాలుగోస్థానంలో వచ్చిన సికింద్రాబాద్ స్టేషన్ రూ. 1,276 కోట్ల ఆదాయం సంపాదించింది. వీటితోపాటు మరికొన్ని రైల్వేస్టేషన్ల జాబితాను కూడా ప్రకటించారు. అందులో 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్లేషన్లు నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చారు. ఈ జాబితాలో దేశంలోని 28 రైల్వే స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి. ఆ జాబితా ఏంటో ఓసారి చూసేద్దాం..
సంఖ్య పరంగా చూస్తే…
అధికశాతం ప్రయాణికులు వచ్చే రైల్వేస్టేషన్లను పరిశీలిస్టే.. అందులో సంఖ్య పరంగా ముంబైలోని థానే రైల్వే స్టేషన్ మొదటిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను 93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ రైల్వేస్టేషన్ గుండా ప్రయాణం సాగించారు. రెండోస్థానంలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ నిలిచింది. ప్రతి సంవత్సరం ఈ రైల్వేస్టేషన్ నుండి సుమారు 83.79 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారుల జాబితాలో తెలిసింది.
న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి సుమారు 39.36 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తర్వాత ఎన్ఎస్జీ 1 హోదా విజయవాడ రైల్వేస్టేషన్‌కు మాత్రమే దక్కింది. ఇప్పడు సాధించిన ఈ గుర్తింపులతో కేంద్రం ఈ స్టేషన్లకు మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు సమాచాం. వీటితోపాటు ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారి పేర్కొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రైల్వేశాఖ ప్రకటించిన ఆదాయం వివరాలివే..
న్యూఢిల్లీ – రూ. 3,337 కోట్లు
హౌరా ( వెస్ట్ బెంగాల్) – రూ. 1,692 కోట్లు
చెన్నై సెంట్రల్(తమిళనాడు) – రూ. 1,299కోట్లు
సికింద్రాబాద్( తెలంగాణ) – రూ. 1,276 కోట్లు
హజరత్ నిజాముద్దీన్( ఢిల్లీ) – రూ. 1,227 కోట్లు
లోకమాన్య తిలక్ టెర్నినల్(ముంబై)- రూ. 1,036 కోట్లు
అహ్మదాబాద్ ( గుజరాత్) – రూ. 1,010 కోట్లు
ముంబై సీఎస్టీ (మహారాష్ట్ర) – రూ. 982 కోట్లు
ప్రయాణికుల సంఖ్య పరంగా పరిశీలిస్తే..
న్యూఢిల్లీ – 39,362, 272 మంది
హౌరా ( వెస్ట్ బెంగాల్) – 61,329,319 మంది
చెన్నై సెంట్రల్(తమిళనాడు) – 30,599,837 మంది
సికింద్రాబాద్( తెలంగాణ)- 27,776,937 మంది
హజరత్ నిజాముద్దీన్( ఢిల్లీ)- 14,537,686 మంది
లోకమాన్య తిలక్ టెర్నినల్(ముంబై)-14,680,379 మంది
అహ్మదాబాద్ ( గుజరాత్) – 18,260,021 మంది
ముంబై సీఎస్టీ (మహారాష్ట్ర) – 51, 652,230 మంది