న్యూఢిల్లీ: మారుతి సుజుకీ.. బ్రెజ్జా కొత్త వెర్షన్ కారును మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ రూ.7.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్).కొత్త బ్రెజ్జాతో ఎస్‌యూవీ విభాగంలో తాము మరింత పటిష్ఠం అవుతామని కంపెనీ తెలిపింది. ఈ రెండో తరం బ్రెజ్జా మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూ, కియా సోనెట్‌తో పోటీ పడనుంది. కొత్త బ్రెజ్జా మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. గత 8 నెలల కాలంలో తాము విడుదల చేసిన ఆరో కారు ఇదని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకయుచి చెప్పారు. కొత్తతరం కే సీరీస్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఈ కారు లీటరు పెట్రోల్‌కు 20.15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రెండు కొత్త వెర్షన్లలోనూ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ర్టిక్ సన్‌రూఫ్, డిజిటల్ 360 కెమెరా, 40 కనెక్టెడ్ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ప్రత్యేకతలున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!