ముఖ ఆధారిత హాజరు యాప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.గత 3రోజులుగా యాప్ డౌన్‌లోడ్‌ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. విద్యాశాఖ కమిషనర్ వద్ద చర్చలు విఫల మవటంతో ఉపాధ్యాయ సంఘాలను మంత్రి చర్చలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ… సొంత ఫోన్లలో ముఖ ఆధారిత హాజరు యాప్‌ను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమ స్మార్ట్ ఫోన్లలో యాప్‌డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం బయటకు లీక్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ప్రత్యేక పరికరంతో మౌఖిక హాజరుకు అంగీకరిస్తామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.ఉపాధ్యాయుల డిమాండ్లపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ముఖ ఆధారిత యాప్‌పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. మంచి లక్ష్యానికి ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లక్షమంది ఉపాధ్యాయులు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నారని తెలి పారు. మిగతా 50శాతం మంది త్వరలోనే రిజిస్టర్ చేసుకుంటారని వెల్లడిరచారు. 15 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించి యాప్ అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సెల్‌ఫోన్లు ఉద్యోగులవా? ప్రభుత్వం ఇస్తుందా? అనేది ఆయా శాఖల నిర్ణయమన్న మంత్రి బొత్స ..మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావొచ్చన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!