డిసెంబర్ 09 (ఆధ్రపత్రిక): హారర్ మూవీస్‌తో ప్రేక్షకులను మరోసారి భయపెట్టడానికి వస్తోన్న లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇప్పటికే పలు హారర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నయన్.. తాజాగా కనెక్ట్ మూవీతో ప్రేక్షకులకు రాబోతున్నారు. ’మయూరి’, ’గేమ్ ఓవర్’ లాంటి సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార స్వయంగా నిర్మిస్తున్న కనెక్ట్ చిత్రం ట్రైలర్ రిలీజైంది. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇంటర్వెల్ లేకుండా 99నిమిషాలలో ఈ చిత్రాన్ని రూపొందించారు. డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానున్న కనెక్ట్… తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. చిత్ర నిర్వాహకులు అర్థరాత్రి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. 2.22 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు టెన్షన్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది. ఈ ట్రైలర్ ప్రకారం… కరోనా లాక్ డౌన్ సమయంలో నయనతార ఆన్లైన్ విూటింగ్‌లో పాల్గొంటుంది. అదే సమయంలో విూటింగ్ లో పాల్గొన్న వారికి ఎవరో తెలియని వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ? ఎవరు చేస్తున్నారు ఆ పని.. అసలెందుకు చేస్తున్నారు అన్న విషయాలను ఈ సినిమాలో చూపించినట్టు తెలుస్తోంది. అనుపమ్ ఖేర్ సైకియాట్రిస్ట్ పాత్రలో మెప్పించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇంటర్వెల్ లేకుండా తీయడంతో సినీ అభిమానులు రిలీజ్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!