డిసెంబర్ 24 (ఆంధ్రపత్రిక): సౌత్‌లో నయనతార క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెలుగు.. తమిళ్ భాషల్లో పెద్ద స్టార్. టాలీవుడ్ సినిమాలు రేర్ గా చేసినా ఇక్కడ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ మాత్రం వెరీ స్పెషల్. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ ఆమె. అనుష్క.. కీర్తి సురేష్ లాంటి వారు ఎంత మంది పోటికొచ్చినా…ఆమెను కొట్టే సత్తా మాత్రం ఇప్పట్లో ఎవరికీ లేదు. గత కొన్నేళ్లగా టాలీవుడ్ లో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఆమెతో నటించాలని చాలా మంది హీరోలు ఆశపడుతున్నా? ఆ ఛాన్స్ మాత్రం అందరికి ఇవ్వదు…కొందరికి మాత్రమే. ఆమె నిర్ణయాలకు దర్శక నిర్మాతలు కూడా కట్టుబడాలి. తను దర్శక.. నిర్మాతలు చెబితే వినే టైప్ కాదు. ఆరకంగా రెండు పరిశ్రమలను నయన్ కొంత కాలంగా శాషిస్తుంది. అందుకే కొన్ని సంవత్సరాలుగా కేవలం నటనకు మాత్రమే పరిమితమైంది. సినిమా ప్రమోషన్లకు మాత్రం హాజరు కానీ ఏకైక హీరోయిన్. ఒక సినిమాకు సంతకం చేసే ముందే ప్రమోషన్ కు రానని కరాఖండీగా చెప్పేస్తుంది. అందుకు నిర్మాత ఒకే అంటేనే సంతకం చేస్తుంది. లేదంటే ఎన్నికోట్లు పారితోషికం ఇస్తామన్నా? ప్రచారం అనేసరికి సారీ చెప్పేస్తుంది. ఎంత పెద్ద హీరో అయినా సరే ప్రమోషన్.. గిమోషన్ అక్కడ జాన్తా నయ్. అయితే ఇలా ప్రమోషన్‌కి ఎందుకు ఢుమ్మా కొడుతుందని విూడియాలో చాలాసార్లు ప్రచారం సాగింది? ఆమెను నేరుగానూ చాలా మంది అడిగారు. కానీ ఇంతవరకూ ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. అయితే తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైతే? సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు విలువ లేదు. చాలా కాలం పాటు వాళ్లకి ఓ విలువ ఉంటుందని భావించా . కొంత కాలం చూసా. కానీ అది జరిగే పని కాదని అర్ధమైంది. అప్పటి నుంచి సినిమా ప్రమోషన్లకు రావడం మానేసా. ఇది నేను బలంగా తీసుకున్న ఓ గీత’ అనేసింది. దీంతో కొన్ని రకాల కథనాలికి నయన్ ఆ రకంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!