ఒకప్పుడు కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్… ఈ మధ్య ట్రెండు మార్చి సీరియస్ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ’నాంది’ సూపర్ హిట్ కాగా ఆ తర్వాత నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీలో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. దీంతో నరేష్ అదే వేవ్ లో కొనసాగుతున్నాడు. నాంది లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల నే నరేష్ మరోసారి నమ్ముకున్నారు. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్లో ’ఉగ్రం’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే నరేష్ మరో కెరీర్ లో మరో డిఫరెంట్ అటెంప్ట్ అని క్లారిటీ వచ్చేసింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని నరేష్ లుక్‌తోనే అర్ధమైంది. తాజాగా కొద్ది సేపటి క్రితమే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఆద్యంతం నరేష్ క్యారక్టరైజేషన్ ని హైలైట్ చేస్తుంది. కామెడీ పాత్రలు చేసే నరేష్ ఒక్కసారిగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కి దిగిపోయారు. ఇందులో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆద్యంతం శత్రువులపై పోలీస్ పవరేంటో చూపించాడు. లైట్లే సి రౌండప్ చేసిన రౌడీలను చితకొట్టిన వైనంలో పూర్తిగా కొత్త నరేష్ ని తెరపై ఆవిష్కరించాడు. గత సినిమాల్లో నరేష్ ఫైట్లు చేసిన సందర్భాలున్నాయి. కానీ ’ఉగ్రం’లో ఉగ్రరూపమే దాల్చాడు. ప్రత్యర్ధులపై బుల్లెట్ల వర్షం.. పవర్ ఫుల్ డైలాగులు..అందులో బీఫ్ సౌండిరగ్ వేయాల్సిన డైలుగులు కూడా నరేష్ నోట పలికాడు. . ’నాది కాని రోజు కూడా నేను ఇలాగా నిలబడతా’ లాంటి డైలాగులు నరేష్ పాత్ర తీరును హైలైట్ చేస్తున్నాయి. కుటుంబ అనుబంధాలున్న పోలీస్ గానూ కనిపిస్తున్నాడు. అవసరం మేర రొమాంటిక్ టచప్ ఇచ్చారు. మొత్తంగా టీజర్ ఆద్యంతం నరేష్ పాత్రని హైలైట్ చేస్తుంది. స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. సాహు గారపాటి హరీష్ పెద్ది కలిసి ఈ సినిమాని స్క్రీన్స్ బ్యానర్ విూద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!