ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధి పొందిన వారితో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధి పొందిన వారితో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడేందుకు కీలక అడుగులు వేయనున్నారు.
కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 15వేల డ్రోన్లను స్వయం సహాయక సంఘాలకు అందించనున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఉపాధి చేకూర్చనున్నారు. ఈ కేంద్రాల్లో మహిళలకు డ్రోన్ ఎలా ఎగురుతుంది, దీని వల్ల వ్యవసాయానికి ఎలా ఉయోగం అవుతుంది అనే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో సంపూర్ణ ఆరోగ్యం అందించడం మరో అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే జన్ ఔషధీ కేంద్రాల ద్వారా ఎమ్మార్పీ ధరలపై 70 నుంచి 80 శాతం రాయితీతో మెడిసిన్ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న జన్ ఔషధీ కేంద్రాల సంఖ్యను పెంచబోతున్నారు. ఇప్పుడు 10వేల కేంద్రాలు అందుబాటులో ఉంటే వాటికి అదనంగా 15వేల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతోజన్ ఔషధీ కేంద్రాల సంఖ్య 25వేలు కానుంది. ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాని చేసిన వాగ్థానాలను నెరవేర్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంటే..
గ్రామీణ ప్రాంతాల్లో అనగా ముఖ్యంగా తాండాల్లో నివసించే ఆదివాసీలకు లబ్ధితో పాటూ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించనున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోనున్నారు. 2023 నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆదివాసీ గౌరవ్ దివస్ నాడు ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం వరకు కొనసాగనుంది.