* నరసాపురం ఎంపీ రఘురామరాజుకు వినతి పత్రం ద్వారా కోరిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు
నరసాపురం జూలై 14 (ఆంధ్రపత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు)నరసాపురం – గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ విజయవాడ వరకు నడపాలని ఎం.పి రఘురామ కృష్ణంరాజుని నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు కోరారు.గత నెల 19 నుండి నిలిపివేసిన నరసాపురం – గుంటూరు (17282) పాస్ట్ ప్యాసింజర్ రైలును విజయవాడ వరకు నడిపేల చర్యలు తీసుకోవాలని ఎంపి కి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు వినతిపత్రం అందజేశారు.నరసాపురం పట్టణం – 14-07-2022 – నరసాపురం – గుంటూరు (17282) పాస్ట్ ప్యాసింజర్ రైలును గుంటూరులో ట్రాక్ రిపైర్ నిమిత్తం జూన్ 19 నుండి నిలుపుదల చేశారు. ఈ. ట్రైన్ లో వందలాది మంది ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, విజయవాడలో చికిత్స నిమిత్తం నరసాపురం పరిసర ప్రాంతాల నుండి ప్రజలు నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. ట్రైన్ రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ ను ప్రస్తుతానికి విజయవాడ వరకు నడిచేల చర్యలు తీసుకోవాలని ఎంపి రఘురామ కృష్ణంరాజుకి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఎంపి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ రైల్వే శాఖ మంత్రి ని కలిసి గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ విజయవాడ వరకు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు.