Skill Development Case: అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. స్కిల్ కేసులో లోకేష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్ తరఫు లాయర్లు. దీంతోపాటు ఫైబర్ నెట్ కేసులోను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం నారా లోకేష్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దని నాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్కిల్, ఫైబర్ నెట్ కేసులో లోకేష్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్ తరఫు లాయర్లు. దీంతోపాటు ఫైబర్ నెట్ కేసులోను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. మరో వైపు.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది కోర్టు.
బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు. విచారణకు సహకరించాలని లోకేష్‌కు కోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు 41A నోటీసులు ఇచ్చింది.. ఆ నోటీసులను ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. లోకేష్‌ను విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలిపింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా ఉన్నారు నారా లోకేష్.
మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టువాయిదా వేసింది. వచ్చేనెల 4వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ మొదటి నిందితుడిగా పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు జరిగాయి. ఆ తర్వాత శుక్రవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు జరిగాయి.
రాజధాని అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వివరాలను కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని తెలిపారు