త్రిపుర కొత్త గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నల్లు ఇంద్రసేనా రెడ్డితోపాటు ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్‌ను నియమించింది. నల్లు ఇంద్రసేనా రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో ఎంఎస్సి పూర్తి చేశారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశారు. వర్సిటీలో విద్యార్థి నేతగా గుర్తుంపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల పట్ల ఆశక్తితో బీజేపీలో చేరారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డిని మరో కీలక పదవి వరించింది. త్రిపుర కొత్త గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నల్లు ఇంద్రసేనా రెడ్డితోపాటు ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్‌ను నియమించింది. తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణ బీజేపీ సీనియర్ నేత.. ఇంద్రసేనా రెడ్డి సూర్యాపేట జిల్లా. ఇంద్రసేనా రెడ్డి గతంలో మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా నల్లు ఇంద్రసేనా రెడ్డి పనిచేశారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇంద్రసేనారెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో ఎంఎస్సి పూర్తి చేశారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశారు. వర్సిటీలో విద్యార్థి నేతగా గుర్తుంపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల పట్ల ఆశక్తి 1980లో బీజేపీ ఆయనను నడిపించింది.
1953 జనవరి 1న జన్మించిన ఇంద్రసేనా రెడ్డి 1983, 1985, 1999లలో జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994లలో అదే నియోజకవర్గంలో ఓడిపోయారు.. ఓడిపోయిన ప్రతిసారి తిరిగి అక్కడి నుంచే గెలవడం ఆయన ప్రత్యేకత. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2003-07 మధ్యకాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, సీహెచ్ విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయల తర్వాత ఇంద్రసేనారెడ్డిగవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా, బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్ల సంఖ్య ప్రస్తుతం మూడుకు చేరింది.
వీరిలో తెలంగాణవారు ఇద్దరు ఏకకాలంలో పనిచేయనుండటం విశేషం. త్రిపుర గవర్నర్‌గా ఇప్పటివరకు బిహార్‌కు చెందిన సత్యదేవ్ నారాయణ్ ఆర్య పనిచేశారు. ఆయన స్థానంలో ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. మరోవైపు, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.