నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): ఇదిలా ఉంటే నాగశౌర్య ఇటీవలే తన నెక్ట్స్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ’ఎన్‌సి24’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.కాగా తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెట్రీ పలనిస్వామి ఛాయగ్రాహకుడిగా పనిచేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, అరుణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని చిత్రబృందం ఇటీవలే వెల్లడిరచింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరుగనున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!