నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): సమంత`నాగచైతన్య విడాకుల ప్రకటన కేవలం దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా గతేడాది హాట్ టాపిక్ అయింది. ఎన్నో ఏళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లకే విడిపోవడంతో.. అటు ప్రేక్షకులు, ఇటు సినీ సెలబ్రెటీలు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి స్వస్తీ చెప్పారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారట. ఇక ఇటీవలే సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే నాగార్జున, నాగచైతన్య.. సమంతను కలువబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించనున్నట్లు టాక్. ’ఏమాయ చేశావే’ సినిమాతో వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించారు. ఈ చిత్రం తర్వాత ’మనం’, ’ఆటోనగర్ సూర్య’, ’మజిలీ’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఓ బిగ్ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే విడాకుల తర్వాత వీరిద్ధరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వివాహా బంధానికి స్వస్తీ చెప్పిన వీరిద్దరూ ప్రొఫేషనల్ పరంగా కలిసి నటించడానికి సిద్ధంగా ఉంటామని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక వీరిద్దరూ మళ్ళీ కలిసిపోవాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా గుడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ’ఎన్‌సి22’ చేస్తున్నాడు.ఇక సమంత ఇటీవలే ’యశోద’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తుంది. హరి`హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరోగసి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. దీనితో పాటుగా గుణశేఖర్ ’శాకుంతలం’లో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి ’ఖుషీ’ చిత్రాన్ని కూడా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!