నవంబర్ 24 (ఆంధ్రపత్రిక): మెగాస్టార్ చిరంజీవి బాటలోనే హీరో కింగ్ నాగార్జున కూడా మలయాళ రీమేక్ పై కన్నేసాడు. ఇటీవల స్టెయ్రిట్ స్టోరీస్ తో నాగ్ చేసిన ’వైల్డ్ డాగ్ ’ ’ది ఘోస్ట్’ సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్ర నిరాశకు గురి చేశాయి. దీంతో నాగ్ రీమేక్ సినిమా అయితే బెటర్ అని ఓ మలయాళ సినిమాపై కన్నేశాడని తెలిసింది. ’పోరింజు మరిమమ్ జోస్’. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో జోషీ రూపొందించిన ఈ మూవీ ఇది. తెలుగులో కృష్ణంరాజుతో ’అంతిమ తీర్పు’ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన జోషీ ఈ మూవీని రూపొందించారు. 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని చూసిన నాగార్జున ఇంప్రెస్ అయ్యారట. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రినాథరావు నక్కిన రూపొందించిన పలు సినిమాలకు రైటర్‌గా వ్యవహరిస్తూ వస్తున్న ప్రసన్న కుమార్ బెజవాడ ఈ రీమేక్ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ రీమేక్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. ఇటీవల రామ్ తో ’ది వారియర్’ నిర్మించి ప్రస్తుతం నాగచైతన్య తో ’కస్టడీ’ మూవీలని అందిస్తున్న శ్రీనివాస చిట్టూరి ఈ రీమేక్ ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిరచనున్నారని తెలిసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!