జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించిన పవన్ అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.