మటన్ హలీం
బోన్‌లె్‌స మటన్ – 600గ్రా, గోధుమ రవ్వ (లావుది) – 300గ్రా, సెనగపప్పు – 50గ్రా, బియ్యం – 50గ్రా, నూనె – 300ఎంఎల్, నెయ్యి – 300ఎంఎల్, కారం – 50గ్రా, పసుపు – 50గ్రా, పచ్చిమిర్చి – 30గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు – 30గ్రా, మిరియాల పొడి – 10గ్రా, నిమ్మకాయలు
* 100గ్రాముల హలీంలో పోషకవిలువలు
* క్యాలరీలు – 157
* ప్రోటీన్ – 9.7గ్రా
* కార్బోహైడ్రేట్లు – 15.2గ్రా
కావలసినవి: బోన్‌లె్‌స మటన్ – 600గ్రా, గోధుమ రవ్వ (లావుది) – 300గ్రా, సెనగపప్పు – 50గ్రా, బియ్యం – 50గ్రా, నూనె – 300ఎంఎల్, నెయ్యి – 300ఎంఎల్, కారం – 50గ్రా, పసుపు – 50గ్రా, పచ్చిమిర్చి – 30గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు – 30గ్రా, మిరియాల పొడి – 10గ్రా, నిమ్మకాయలు – మూడు, యాలకులు – 50గ్రా, గరంమసాలా – 50గ్రా, ఉల్లిపాయలు – 200గ్రా, పెరుగు – 100గ్రా, పుదీనా – 50గ్రా, తమలపాకు వేర్లు (పాన్ కి జాద్) – 30గ్రా, ఖాస్ కి జాద్ – 30గ్రా.
తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఖాస్ కి జాద్, పాన్ కి జాద్ వేసి, తగినన్ని నీళ్లు పోసి 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి. గోధుమరవ్వ, సెనగపప్పు, బియ్యంను అరగంటపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై మందంగా ఉండే పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. ఇందులో నుంచి గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు, పసుపు, కారం, గోధుమరవ్వ-సెనగపప్పు-బియ్యం పేస్టు వేసి కలపాలి. ఈ మిశ్రమం వేగిన తరువాత మటన్ వేయాలి. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలియబెట్టాలి. నిమ్మరసం, మిరియాల పొడి, యాలకులపొడి, గరంమసాలా వేయాలి. పైన నెయ్యి వేసుకోవాలి. వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించాలి.