మూడు పార్టీలకు ప్రతిష్టగా మారిన ఉప ఎన్నిక
టిఆర్ఎస్ గెలిస్తేనే జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌కు పట్టు
బిజెపి గెలిస్తే తెలంగాణపై మరింత ఫోకస్
కాంగ్రెస్ గెలిస్తేనే రేవంత్‌కు భవిష్యత్
హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): అధికారపక్షంతో పాటు విపక్ష పార్టీలకు మునుగోడు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికలో గెలిచిన వారే రేపటి సార్తిక్ర ఎన్నికలకు హాట్ ఫేవరేట్ కానున్నారు. ఈ ఉప ఎన్నికగెలవడంద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకున్న వ్యక్తిగత సత్తాను చాటాల్సి ఉంది. ప్రజలంతా తమవైపే అంటున్న ఆయనకు వ్యక్తిగతంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. ఇదే సదర్భంలో తెలంగాణ లో అధికారంలోకి వస్తామని పదేపదే ప్రకటిస్తున్న బిజెపికి కూడా ఇదో అగ్ని పరీక్షే. ఇక్కడ గెలిస్తేనే బిజెపి గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఇకపోతే అధికార టిఆర్ఎస్ పార్టీకి,ముఖ్యంగా కెసిఆర్‌కు ఇక్కడ గెలవడం ఎంతో అవసరం. జాతీయ రాజకీయాలపై పోకస్ పెట్టిన ఆయన మునుగోడులో గెలిస్తేనే బిజెపికి సవాల్ విసిరే అవకాశం ఉంది. తన పాలనపై విమర్శలకు చెక్ పెట్టగలుగుతారు. సర్వే నివేదికలన్నీ ఎలా ఉన్నా పరిస్తితులు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవడం వేరు.. గెలవడం వేరు. ఇకపోతే సవాళ్లు విసురుతున్న రేవంత్ రెడ్డికి మాత్రమే ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. ఇక్కడ ఓడిపోవాలనే కాంగ్రెస్ నేతలు మనసులో కోరుకుంటారు. ఓడితే నెపాన్ని రేవంత్‌పై నెట్టి..అతడిని పిసిసి నుంచి తప్పించాలన్న డిమాండ్తెరపైకి తీసుకుని వస్తారు. గతంలో హుజూరాబాద్‌లో డిపాజిట్ దక్కనప్పుడే ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. అందుకే మునుగోడులో విజయం మూడు పార్టీలకు కూడా ముఖ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపిక కూడా ముఖ్యమే. బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారు. కాంగ్రెస్‌లో అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. అలాగే టిఆర్ఎస్లో కూసుకుంట్లకు ఇవ్వరాదన్న డిమాండ్ ఉంది. మునుగోడు ఉపఎన్నికకు దూరంగా ఉండాలని, రేవంత్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి నుంచీ వామపక్షాలకు పట్టు ఉండేది. ఇటీవలి కాలంలో వారి పోరాటాలు ఎక్కడా కానరావడం లేదు. దీంతో జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఆ పార్టీకి లేదు. బీజేపీకి పునాదులు లేకపోయినా ఇప్పుడు కోమటిరెడ్డితో పునాది పడిరదనే చెప్పాలి. అయితే అందరికన్నా ఉత్సాహంగా బీజేపీ నాయకత్వం ఉంది. మునుగోడు ఎలాగూ సిట్టింగ్ సీటు కానప్పుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని టిఆర్ఎస్ పార్టీలోని ఒక వర్గం వాదిస్తున్నది. ఓడినా అది తమ సీటు కాదన్న వాదనను తీసుకుని వచ్చే ప్రయత్నం చేయవచ్చు. దీంతో తమకు వచ్చిన నష్టం కూడా ఏవిూ లేదని హుజూరాబాద్‌లో చేసిన ప్రకటనతో సిద్దంగా ఉంది. కాంగ్రెస్‌లో ఈ వాదన మరోలా వినిపిస్తున్నది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకం అవుతుంది తప్ప తమకెలా అవుతుందని వాదిస్తున్నారు. కాగా, చండూరు సభపై సమాచారం ఇవ్వకపోవటం, ఉప ఎన్నికపై గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానించకపోవటంపై
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇది పరోక్షంగా రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా నిలిచేలా, క్షేత్రస్థాయిలో అనుచరులకు సమాచారం ఇచ్చేదిగా ఉంది. హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచినా ఫర్వాలేదన్న ఉదాసీనతను మునుగోడులో ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్‌లోని ఓ వర్గం వాదిస్తోంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే టిఆర్ఎస్,కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా కష్టమే. పార్టీ వలసలను ఆపడం కష్టమన్న భయం పట్టుకుంది. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కానీ బీజేపీని నిలువరించే వ్యూహంతో పనిచేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. అందుకే మునుగోడు ఉపఎన్నికలో పార్టీకి జరిగే నష్టాన్ని ఏ మేరకు తగ్గించుకోగలమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తున్నది. ఉపఎన్నిక జరిగేనాటికైనా కొంత బలపడేలా వ్యూహరచన చేస్తున్నది. ఇకపోతే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుకున్న బిజెపి సంస్థాగత వ్యవహారాలు చూడటానికి ప్రత్యేకంగా సునీల్ బన్సాల్‌ను ఇన్చార్జిగా నియమించింది. ముందస్తు ఎన్నికలకు సై అంటూ ఇంతకాలం కాలు దువ్విన బీజేపీ ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక ద్వారా కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు సవాల్ విసురుతోంది. దీంతో మునుగోడ ఉప ఎన్నిక దేశవ్యప్త చర్చగా మారింది. జాతీయస్థాయిలో మోడీకి ప్రత్యమ్నాయం కావాలని చూస్తున్న కెసిఆర్ ఈ ఎన్నికలో సర్వ శక్తులు ఒడ్డబోతున్నారు. ఇక్కడ గెలవడం ద్వారా ఢల్లీిపై గురిపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిందని, ఐదు పర్యాయాలు సీపీఐ గెలుచుకున్నదని చెప్పారు. 2018లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. మునుగోడులో సీపీఎం, సీపీఐ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. రెండు పార్టీల్లోనూ టీఆర్ఎస్ వైపే మొగ్గు కనిపిస్తోంది. లెప్ట్ పార్టీలకు ఇక్కడ దాదాపు 20 వేల ఓట్లు ఉంటాయని అంచనా. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుందని, భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఈక్రమంలో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా బైపోల్ పైనే ఫోకస్ పెట్టారు. ఈ నెల 20న టీఆర్ఎస్, 21న బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ అసమ్మతి వాదులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా విూటింగ్ పెట్టుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని కోరుతూ తీర్మానం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడు, నాంపల్లి మండలాల్లో పర్యటించారు. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో స్థానిక నేతలకు వివరించారు. 21న నిర్వహించే అమిత్‌షా బహిరంగ సభ గురించి మాట్లాడారు. మొత్తంగా మూడు పార్టీలకు ఇది సవాల్ లాంటిదే.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!