కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలోనే సీఎం ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.
ఈ ఘటన నేపథ్యంలో భారీగా మొహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని వారిని అరెస్టుచేశారు. అనంతరం అక్కడి నుంచి వేరే చోటుకు తరలించారు.
అయితే, ‘ముడా ‘ భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయన్ను విచారించాలని గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతించారు.ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను సిద్ధరామయ్య సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని కోర్టు నొక్కిచెప్పింది.ఈ క్రమంలోనే విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమైన సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు.