హైదరాబాద్,ఫిబ్రవరి 13 (ఆంధ్రపత్రిక) : హైదరాబాద్ సవిూపంలోని ముచ్చింతల్ శ్రీరామ్‌నగర్ ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతకు మించిన పర్యాటక కేంద్రంగా మారింది. గత ఏడాది ఇదే నెలలో రామానుజుల విగ్రహావిష్కరణ తరవాత ఇప్పుడు ప్రఖ్యాత పర్యాటకకేంద్రంగా మారింది. గత వారం రోజులుగా జరుగుతున్న వార్ఇషకి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. రామానుజ బృహన్‌మూర్తి, నూట ఎనిమిది దివ్యదేశాల ఆలయాలు కూడా అద్భుత ఆవిష్కరణగా నిలిచాయి. ఈ క్రమంలో రోజుకో యజ్ఞంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లారు. వెళ్లివచ్చిన వారంతా తన్మయత్వం చెందారు. అక్కడికి వెళ్లిన వారు అనుభూతి పొందారు. దైవం కంటే దైవాన్ని స్తుతించే మంత్రం గొప్పదా?..నిస్సందేహంగా అవుననే అంటారు స్వామివారు. దైవం ఓ పట్టాన అంత సులభంగా అందడు. పర్వతాలు, ప్రాకారాలు దాటుకొని, అక్కడెక్కడో గర్భగుడిలో కొలువైన స్వామి దరికి చేరాలంటే ఎంత శ్రమో..!కాని మంత్రాన్ని నిష్ఠగానో, ఆర్తిగానో, ప్రేమతోనో జపిస్తే ఆ వైకుంఠాన్నైనా విడిచి మన దగ్గరికే వడివడిగా పరుగెత్తి రాడూ..! మంత్రాధీనుడు కనుక వచ్చితీరుతాడు… అదే నిరూపించారు ఆనాడు భగవద్రామానుజులు..! గుళ్లోని దేవుణ్ణి కనీసం కళ్లారా చూసే భాగ్యానికైనా నోచుకోని జనానికి ` తిరుమంత్రాన్నిచ్చి ` ఆ దేవుణెళ్ణి ఆర్తుల చెంతకు రప్పించారు. రామానుజులు ఎంత ఘనుడు కాకపోతే ` శంఖుచక్రాలు తీర్చి ఆ దేవాదిదేవుడికే ఆచార్యుడవుతారు!? మన విూదెంత వాత్సల్యం లేకపోతే` అంతటి ఘనుడు ఇవాళ తేజోవిలసిత స్వర్ణదేహంతో మన మధ్య ఆవిష్కృడౌతాడు..!?ఆనాడెప్పుడో తిరుమలవాసుడికి ఆచార్యుడిగా మారిన దివ్యదృశ్యం ఈనాడు సమతాస్థలిలో ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగింది… దివ్యదేశాల్లో ఒకటైన తిరుమల ఆలయాన్ని, అందులో శ్రీనివాసుడి దివ్యమూర్తిని శ్రీరామ్‌నగర్‌లో చిన్నజీయరు ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే ` వెయ్యేళ్లనాడు రామానుజులు స్వామికి శంఖుచక్ర ప్రదానం చేసిన దృశ్యం ఆవృతమైనట్టు ఒక పరవశం కలిగింది…! ఇదెంత పుణ్యమో కదా! చూసిన మనదెంత భాగ్యమో కదా అని మనసు ఆనంద తరంగితం అయ్యింది.. విశ్వరూపంలాంటి పంచలోహాకృతి రామానుజుల బాహ్య శరీరమైతే ` అంతర్భాగంలో ఒదిగిన స్వర్ణమూర్తి వారి ఆత్మ స్వరూపమేమో! దివ్యదేశ సముదాయంలోని 108 దేవమూర్తుల కైంకర్యాలన్నీ పర్యవేక్షించేందుకే అలా కొలువైనట్టున్నారు… వెయ్యేళ్ల నాడు దైవారాధనా వ్యవస్థంతా వారు నిర్దేశిరచిందే కదా..!
“““““““““““““`
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!