………..రాజానగరం నియోజకవర్గంలో హర్షాతిరేకాలు……..
కోరుకొండ, ఫిబ్రవరి 9 (ఆంధ్ర పత్రిక):
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పాలకవర్గ సభ్యులుగా కోరుకొండ గ్రామానికి చెందిన సీనియర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీమతి రజిని నియమితులయ్యారు.రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముఖ్య అనుచరుడు తాడి హరిశ్చాంధ్రప్రసాద్ రెడ్డి సేవలు గుర్తించి వారి శ్రీమతి రజనిని అన్నవరం దేవస్దానం బోర్డు మెంబెర్ గా నియమించారు. ఈ సందర్భంగా కోరుకొండతో పాటు రాజనగరం నియోజవర్గం సర్వత్ర హర్షo వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన పాలకవర్గ సభ్యులు శ్రీమతి తాడి రజిని హరిబాబు రెడ్డి అన్నవరం దేవస్థానం అభివృద్ధికి మరింత కృషి చేస్తారని స్వామివారి భక్తులు, ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా అన్నవరం దేవస్థానం దత్తత దేవాలయమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము అభివృద్ధికి కృషి చేయగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తుల చిరకాల కోరిక ప్రతిరోజు ఉదయం సాయంత్రం కోరుకొండ స్వామి వారి ఆలయ వద్ద నుంచి ‘అన్నవరం – కోరుకొండ’ ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞాపనను నెరవేర్చాలని ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా హరిచంద్ర ప్రసాద్ రెడ్డి కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.