అందుకే.. అలెర్ట్‌గా ఉండండి… ఇదే ఇప్పుడిదే.. సైబర్ నేరగాళ్ల నయా ట్రెండ్.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా కన్ఫ్యూజ్ చేసి కొల్లగొడతారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. వింటే మాయమాటలు.. లేకుంటే బెదిరింపులు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆన్లైన్ మోసం ద్వారా లోక్‌సభ సభ్యుడు, కేంద్ర సమాచార శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 మాయం అయ్యాయి. ఒక కేటుగాడు మారన్ భార్యకు ఫోన్ చేసి తాను బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పాడని మారన్ X పోస్ట్ చేశాడు.
సైబర్ నేరగాళ్లు రకరకాలు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు.. గిఫ్ట్‌లు, కేవైసీలు, లాటరీల పేరుతో మాయమాటలు చెప్పి మోసాలు చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నా చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. వారికి వారు.. వీరు అనే తేడాలేదు. ఎవరి ఖాతా అయినా మాయం చేయగలరు. సైబర్ మోసానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతను తన OTPని ఎవరితోనూ పంచుకోలేదు లేదా ఏ లింక్‌పై క్లిక్ చేయలేదు. అయినప్పటికీ అతను సైబర్ మోసానికి గురయ్యాడు. ఎంపీ దయానిధి మారన్ మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు ఎంకరుణానిధి మనవడు. ఈ కేసులో ఎంపీ దయానిధి మారన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాను రూ.99,999 మోసపోయానని తెలిపారు.
తన భార్యకు మూడు వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్లుగా ఎంపీ పోలీస్ ఫిర్యాదులో తెలిపారు. ఓటీపీని తన ప్రియా మారన్ షేర్ చేలేదని తెలిపారు. దయానిధి మారన్ తన భార్యతో యాక్సిస్ బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఉందని.. అయితే ఆ ఖాతాతో తన భార్య నంబర్ లింక్ కాలేదని తెలిపారు.
మొదట ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నాడని.. అందుకే అతని భార్య అతనితో మాత్రమే మాట్లాడిందని దయానిధి మారన్ పోలీసులకు తెలిపారు. దీని తర్వాత, కొంత సమయం తర్వాత అతని భార్యకు రెండు వేర్వేరు నంబర్ల నుండి కాల్ వచ్చింది. మూడో కాల్ డిస్కనెక్ట్ అయిన కొద్దిసేపటికే తమ సేవింగ్స్ ఖాతా నుంచి రూ.99,999 కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని ఎంపీ దయానిధి మారన్ తెలిపారు. ఈ మొత్తం ఒకే లావాదేవీలో డెబిట్ అయినట్లుగా వివరించారు.
కాల్స్ వచ్చింది ఈ నెంబర్ నుంచే..
దీని తర్వాత, సాయంత్రం 4.15 గంటల సమయంలో దయానిధి మారన్ భార్యకు మరో మొబైల్ నంబర్ (+916295812314) నుంచి ఎనిమిది కాల్స్ వచ్చాయి. అప్పుడు అతనికి మొబైల్ నంబర్ +916215549621 నుంచి మరొక కాల్ వచ్చింది. వెంటనే.. దయానిధి మారన్ తన సేవింగ్స్ ఖాతా నుంచి రూ.99,999 డెబిట్ అయినట్లు మెయిల్, మెసేజ్ వచ్చాయన్నారు.
ఎంపీ దయానిధి మారన్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. మోసగాళ్ళు తన ప్రైవేట్ సమాచారాన్ని ఎలా యాక్సెస్ చేశారని ఆయన ప్రశ్నించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను చాలా సులభంగా ఉల్లంఘించినందుకు తాను షాక్ అయ్యానని మారన్ పేర్కొన్నారు. అతను కేంద్ర ప్రభుత్వం నుంచి “జవాబుదారీతనం, న్యాయం” కావాలంటూ ఎంపీ దయానిధి మారన్ డిమాండ్ చేశారు. ఒక వార్తా నివేదికను ఉటంకిస్తూ, జనవరి 2020 నుండి జూన్ 2023 వరకు భారతదేశంలో జరిగిన సైబర్ నేరాలలో 75% ఆర్థిక మోసాలకు కారణమని ఆయన అన్నారు.
ఈ సైబర్ ఫ్రాడ్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలకు సంబంధించి నిఘా పెరిగినప్పటికీ సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. సైబర్ నేరాలు జరగకుండా అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి మోసం జరిగినా వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించండి.