ఢిల్లీ : కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఐదో దశ పోలింగ్ మే 20(సోమవారం) పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఐదో దశ ఎన్నికలు విజయవంతంగా ముగిసిపోయాయి. తదుపరి రెండు దశల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జూన్ 4న మోడీ ప్రభుత్వం విడిపోయి, భారత కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. అలాగే ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే భారత కూటమికి 300 కంటె ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.