షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి పేరు సంపాదించుకొని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఈ సినిమా అనంతరం సుహాస్ కి భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఇక సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు. రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. కామెడీ, ఎమోషనల్, అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా సరికొత్తగా చేశారు చిత్రయూనిట్. సినిమాకి ఆదరణ పెంచడానికి ఉమెన్స్ కి స్పెషల్ గా ఒక రోజంతా పలు థియేటర్స్ లో ఫ్రీ షోలు వేశారు. దీంతో చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. చాలా తక్కువ కాస్ట్, తక్కువ లొకేషన్స్, తక్కువ టైంలో, ఒక 10 మంది తప్పితే మిగిలిన వాళ్లంతా చిన్న చిన్న ఆర్టిస్టులతోనే ఈ సినిమాని తీయడంతో కేవలం 2-3 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ సినిమా మొదటి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మొదటి వారంలోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళింది. తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమా 10 రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. ఇక అమెరికాలో కూడా 300 డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసింది. మరో మూడు రోజుల వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమాకి లాభాలతో పాటు హీరో సుహాస్ కి హిట్ 2 లో విలన్ గా, రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సుహాస్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాక విలన్ గా, హీరోగా మరిన్ని అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!