కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచాన్ని ఇప్పుడు మంకీపాక్స్ ఇబ్బందిపెడుతోంది.ఇప్పటికే 92 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. 35 వేల మందికి సోకింది. వీరిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారంలోనే దాదాపు 7,500 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు వారంతో పోల్చితే.. 20 శాతం మేర కేసులు పెరిగాయని ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. ఈ వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని గత నెల ప్రజారోగ్య అత్యయిక స్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీకా గురించి చర్చ నడుస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. మంకీపాక్స్ టీకాలు 100 శాతం ప్రభావం చూపుతాయని ఆశించలేమని వెల్లడిరచింది. అందుకే జాగ్రత్తలు పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించింది.‘’మేము బ్రేక్‌థ్రూ కేసులను పరిశీలించడం మొదలుపెట్టినప్పుడు మాకు కీలక సమచారం లభించిందన్నది వాస్తవం. ఎందుకంటే.. నివారణకు లేదా వైరస్ సోకిన తర్వాత గానీ టీకాలు నూరుశాతం ప్రభావ వంతం కాదని తెలుస్తోంది’’ అని ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. స్మాల్‌పాక్స్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసింది. అయితే, మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేనప్పటికీ స్మాల్‌పాక్స్‌కు అందుబాటులో ఉన్న టీకానే మంకీపాక్స్ నిరోధానికి ఆయా దేశాలు అనుమతి ఇస్తున్నాయి.
జన్యుమార్పులే వ్యాప్తికి కారణమా..?
ఈ వ్యాప్తికి ఉత్పరివర్తనలు కారణమా అనే ప్రశ్నపై ఆరోగ్య సంస్థ స్పందించింది. ‘ఈ జన్యుమార్పుల ప్రభావం గురించి సమాచారం తెలియాల్సి ఉంది. వైరస్ వ్యాప్తి, వ్యాధి తీవ్రతలో ఈ ఉత్పరివర్తనల ప్రభావం ఏమేరకు ఉందనేదానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుత ఇన్ఫెక్షన్లకు జన్యుమార్పులు లేక హోస్ట్ ఫ్యాక్టర్స్ కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది’ అని పేర్కొంది. ప్రస్తుతం మంకీపాక్స్‌లో కాంగో బేసిన్(మధ్య ఆఫ్రికా), పశ్చిమ ఆఫ్రికాకు చెందిన రెండు వేరియంట్లు ఉన్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!