మచిలీపట్నం సెప్టెంబర్ 7 ఆంధ్ర పత్రిక.:
అంగన్వాడీ కేంద్రాల పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వెలగపూడి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పాఠశాల విద్య, గ్రామ వార్డు సచివాలయాలు స్పందన అర్జీల పరిష్కారం, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో మంచి పోషకాహారం అందించి పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం పోషకాహారం అందిస్తున్న పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం సరైంది కాదన్నారు. ఒక నిర్ణీత సమయం నిర్ధారించుకుని ఎదుగుదలను గమనించాలన్నారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హైరిస్కు కేసులు మినహా సాధారణ ప్రసవాలు తప్పనిసరిగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా కీటక జనిత వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కుటుంబ వైద్యుల పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలన్నారు.
పాఠశాల విద్యార్థుల్లో రక్తహీనత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుపరచాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెంచాలన్నారు.
ఐదు నుండి 18 సంవత్సరాల పిల్లలందరూ
పాఠశాల లేదా కళాశాలలో చేరి ఉండాలని ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా విద్యాసంస్థల్లో చేర్పించాలన్నారు
మనబడి నాడు నేడు రెండవ దశ పనులు మరింత వేగవంతం చేయాలన్నారు.
విద్యాశాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయాల విద్యా కార్యదర్శులు పాఠశాలలను వారానికోసారి సందర్శించి అక్కడ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, డీఈవో తాహేరా సుల్తానా, జెడ్ పి సీఈవో జ్యోతిబసు, డిపిఓ నాగేశ్వర్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.