మోడీ తీరును ఎండగడుతున్న పార్టీలు
దీనికి సమాధానం చెప్పాలంటూ నిలదీత
న్యూఢల్లీి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడి మొదలయ్యింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు గట్టిగానే మోడీ
విధానాలను తూర్పార బడుతున్నారు. పేదలను ఆదుకోవడం తమ విధానమైతే కార్పోరేట్ గద్దలకు దోచి పెట్టడం మోడీ విధానమని దుయ్యబడుతున్నారు. లక్షల కోట్ల రుణాలు మాఫీచేయడం, బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన వారిని వదిలి పెట్టడంపై వరుసగా విమర్శలకు దిగుతున్నారు. ఇది ఓ రకంగామోడీ విధానాలకు ఎదురవుతున్న సవాల్‌గానే పరిగణించాలి. ఈ క్రమంలో తెలంగాన సిఎం కెసిఆర్ ఇప్పటికే లెక్కలతో సవాల్ చేశారు. పెన్షన్లు ఇవ్వడం, ఆదుకోవడం ఉచితం ఎలా అవుతుందని నిలదీసారు. అలాగే ఢల్లీి సిఎం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కూడా ఇదే తరహా విమర్శలు గుప్పించారు. ఉచితాలపై చర్చ చేద్దామని సవాల్ చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండిపడిరది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5.8 లక్షల కోట్లను ఎందుకు మాఫీ చేశారు? ఏటా రూ.1.45 లక్షల కోట్ల మేర కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల మాఫీ, కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపుపై చర్చకు ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రద్దు చేసిన రూ.9.92 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని విూడియాకు ఆయన వివరించారు. రద్దయిన రుణాల నుంచి కేవలం రూ.1.03 లక్షల కోట్లను మాత్రమే రాబట్టగలిగామంటూ ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించిందన్నారు. రానున్న కాలంలో రుణ రికవరీ మరో 20శాతం మేర పెరుగుతుందని భావించినా అప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ మాఫీ రూ.5.8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ధనికులకు వివిధ రూపాల్లో వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు.వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!