ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది. మూడు పార్టీల కూటమి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమయ్యాయి. ప్రధాని మోదీ ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఆ సమావేశంలో ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంది. పవన్ కేంద్రంగా భవిష్యత్ రాజకీయంపై మోదీ అన్ని పార్టీల సమక్షంలోనే క్లారిటీ ఇచ్చేసారు. పరోక్షంగా చంద్రబాబు అలర్ట్స్ అందాయి. చంద్రబాబు చక్రం తిప్పుతారని భావిస్తున్న వేళ తాజా సంకేతాలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
మోదీ వ్యాఖ్యల వెనుక
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ మాట్లాడారు. కూటమికి మద్దతు తెలిపిన పార్టీలు, అధినేతలు, ఎంపీలకు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్డీఏ పక్షనేతగా ..ప్రధానిగా భాగస్వామ్య పక్షాల నేతలు ప్రతిపాదించారు. అందులో చంద్రబాబు సైతం ఉన్నారు. ప్రధానిగా మోదీ దేశానికి అవసరమైన సమయంలో బాధ్యతలు చేపట్టారన్నారు. ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠ ను పెంచారన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ పరోగమిస్తుందని చెప్పుకొచ్చారు.
పవన్ పై ప్రశంసలు
ఇక, పవన్ కల్యాణ్ మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని నాయకత్వం అవసరమని స్ఫష్టం చేసారు. ప్రధాని మోదీ పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌కు మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ పేరును ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. మన సమక్షంలోనే పవన్ ఉన్నారు కాబట్టి పవన్ కల్యాణ్ అంటే ఒక సునామీ అని పేర్కొన్నారు. పవన్ అంటే పవనం కాదని.. సునామీ అని మోదీ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ విజయం అందజేశారని గుర్తుచేశారు.
భవిష్యత్ పై సంకేతాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కల్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారని గుర్తుచేశారు. అయితే, పవన్ ను ఈ తరహాలో అందరి సమక్షంలో మోదీ ప్రత్యేకంగా అభినందించటం పైన చర్చ మొదలైంది. చంద్రబాబు మద్దతు కీలకమని భావిస్తున్న సమయంలో మోదీ మార్క్ రాజకీయం ఏంటో..భవిష్యత్ లో తన లెక్కలు ఎలా ఉంటాయో మోదీ పరోక్షంగా స్పష్టం చేసారనే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ తో కలిసి రాజకీయ ప్రయాణం పైన మోదీ తొలి నుంచి ఆసక్తితో ఉన్నారు. ఏపీలో భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై మోదీ స్పష్టతతో ఉన్నారని పార్టీ నేతల సమాచారం. దీంతో.. మోదీ తాజా వ్యాఖ్యలతో ఏపీలో ఆసక్తి కర చర్చకు అవకాశం ఏర్పడింది.