మోడీ దసరా కానుక-ఏపీకి రూ. 7211 కోట్లు, తెలంగాణకు రూ.3745 కోట్లు..!
ANDHRAPATRIKA : – – తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ దసరా కానుక ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు కూడా పన్నుల వాటాను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏపీ, తెలంగాణ తమకు పన్నుల్లో రావాల్సిన వాటాను అందుకోబోతున్నాయి. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఇది పండుగ వేళ కేంద్రం శుభవార్తగా భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏడాది పొడవునా వసూలయ్యే పన్నుల్లో రాష్ట్రాలకు కేంద్రం నిబంధనల ప్రకారం తమ వాటాను ఉంచుకుని మిగిలింది ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని దశల వారీగా కేంద్రం విడుదల చేస్తుంటుంది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలకు కలిపి లక్షా 78 వేల కోట్లను విడుదల చేస్తోంది. ఇందులో ఏపీకి రూ.7221 కోట్లు పన్నుల వాటాగా ఇవాళ విడుదల చేశారు. అలాగే తెలంగాణకు రూ.3745 కోట్లను పన్నుల వాటాగా విడుదల చేశారు.