ఎమ్మెల్యే ప్రసాదరాజు నరసాపురం పై కక్ష గట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు :
మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు.
నరసాపురం జూలై 30 (ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు)నరసాపురం పట్టణంలో స్థానిక వ్యాపారులు ఎదుగుదల లేకుండా అడ్డు పెట్టడం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే బండారు అన్నారు. ఆదివారం స్థానిక రాయిపేట కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పేరుతో నాలుగేళ్ల నుండి ప్రతి సంవత్సరం షాపులు కొట్టివేస్తు వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. మూడోసారి డ్రైనేజీ నిర్మాణం పేరుతో మూడోసారి షాపులు కొట్టివేయటం పై షాప్ యజమానులు మున్సిపల్ కమిషనర్ కు అభ్యంతరం తెలిపారు. దీనిపై కమిషనర్ తో చర్చలు జరిపిన అనంతరం ఒక్క అడుగు లోపలికి తొలగిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని దీని ప్రకారం శనివారం షాపులు కొట్టివేశారని మాధవ నాయుడు తెలిపారు. కానీ ఎమ్మెల్యే ఒత్తిడితో అర్థరాత్రి భారీ పోలీసు బలగాలతో, మున్సిపల్ అధికారులు మళ్ళీ మార్కింగ్ వేసి తొలగించడానికి ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. అన్యాయంగా షాపులు కొట్టటానికి వీలులేదని కోర్టు ఉత్తర్వులు వున్నాయని మున్సిపల్, పోలీసు అధికారులకు చూపించిన అధికార మదంతో, ఎమ్మెల్యే అండతో పోలీసులు వీధి రౌడీల వలె వ్యవహరించి, నన్ను నా కార్యకర్తలపై పోలీసు జులుం చూపించి అక్రమంగా అరెస్ట్ చేసి, షాప్ ల ముందు అరుగులను తొలగించారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తెలిపారు. ఎమ్మెల్యే ఉద్దేశ్యపూర్వకంగా కక్ష కట్టి నియోజకవర్గ అభివృద్ధి ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. నాలుగేళ్ళ పాలన లో మూడు సార్లు డ్రైనేజీ లు కొట్టించిన ఘనత ఎమ్మెల్యే ప్రసాదరాజుదేనని అన్నారు. గోదావరి ఒడ్డున ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంద అడుగుల లోపలకు ఇళ్ళ నిర్మాణం వుండాలని కానీ ఎమ్మెల్యే ప్రసాదరాజు అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని అన్నారు. రూలు ప్రకారం చెప్పే అధికారులకు ఆ నిర్మాణాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రసాద్ రాజు రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తాకట్టు పెట్టరని అన్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత లబ్ది కోసం ఎన్ని దుర్మార్గాలు చేయడానికైనా వెనుకాడాడన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై న ఇప్పటికే 13 కేసులు పెట్టారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నడని, కేసులు పెడితే భయపడేది లేదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, ప్రజల కోసం వారికి న్యాయం జరిగే వరకు ఎంతవరకు అయిన వెళతానని మాధవ నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో చిటికెల రామ్మోహనరావు, అండ్రాజు రామన్న, రేవు ప్రభుదాస్, చెంపాటి సత్యనారాయణ రాజు, ఈద సురేష్, మాండ్రు హేమలత, నడిపుడి కృష్ణ, కొండేటి శ్రీను, బస్వాని ఏడుకొండలు, నడిపూడి శ్రీను, బళ్ళ శ్రీను, చల్లా పద్మావతి, గాడి శివగౌరి, వెలిది ముక్తేశ్వరరావు, కొల్లటి హరి, కవురు రంగ, అడిదెల డానియల్, మొసుగంటి శేఖర్, పెమ్మడి శ్రీదేవి, గుబ్బల మహేష్, ఆరవ రాంబాబు, పెచ్చేటి శ్రీను, గంధం తేజ, కొనేదల చిన్ని, పెదశింగు భాస్కరరావు, కవురు నాగేశ్వరరావు, పులపర్తి దత్తు, కొల్లటి పెంటయ్య, ములస్వామి తదితరులు పాల్గొన్నారు.