తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికారపార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ హైస్పీడుతో దూసుకెళ్తున్నాయి.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఓట్ల వేటకు కావాల్సిన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికారపార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ హైస్పీడుతో దూసుకెళ్తున్నాయి.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఓట్ల వేటకు కావాల్సిన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా వరుస పర్యటనలు చేస్తున్నారు. జెట్ స్పీడుతో పర్యటనలు చేస్తున్న మంత్రులు.. ఓ వైపు క్యాడర్లో జోష్ పెంచుతూనే.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు.
ఈ తరుణంలో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమమని, దక్షిణాదిలో సరికొత్త రికార్డ్ సృష్టిస్తామంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కి రికార్డ్ స్థాయి మెజార్టీ రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీచేస్తుంటే.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ ఎద్దెవా చేశారు. మూడోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుని దక్షిణ భారత్‌లో కేసీఆర్ కొత్తరికార్డును సృష్టిస్తారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ముదిరాజ్‌లకు సీట్లు ఇవ్వలేకపోయామని.. కానీ నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు.