నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందనే విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి 3 ప్రముఖ విషయాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయం నుంచే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య కృష్ణా జలాల వాటా విషయంలో వివాదం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వాటా పంపిణీ కోసం ట్రిబ్యూనల్‌కు జారీ చేసిన కొత్త సూచనలతో తెలంగాణలో 50 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందనే విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి 3 ప్రముఖ విషయాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయం నుంచే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య కృష్ణా జలాల వాటా విషయంలో వివాదం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
1976లో ఇచ్చిన కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డ్ లో ఉమ్మడి ఏపీకి 819 టీఎంసీ నీటిని కేటాయించింది. 2004లో కృష్ణా ట్రిబ్యునల్ -2 ఏర్పాటైంది. 2013లో అవార్డ్ ఇచ్చినా గెజిట్ పబ్లిష్ కాలేదు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వాటాల విషయం మళ్లీ చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి, కొత్త ట్రిబ్యునల్ కోరింది. ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. తద్వారా దీనికి పరిష్కారం చూస్తామని చెప్పింది. ఆ మేరకు న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి, ఉన్న ట్రిబ్యునల్ రద్దు చేయకుండా ఉన్న ట్రిబ్యునల్ కు బాధ్యతలు ఇవ్వొచ్చు అని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇప్పటికే ఉన్న కృష్ణా ట్రిబ్యునల్ -2 కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆ మేరకు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటా తేల్చడం కోసం కృష్ణా ట్రిబ్యునల్ -2 కు బాధ్యత అప్పగిస్తూ నేడు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 89కు ఇబ్బంది లేకుండా ట్రిబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతం ప్రజలు, ముఖ్యంగా రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది.
నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సాగింది. నీటి సమస్య పరిష్కారంలో ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో 9.08% ట్రైబల్ జనాభా ఉంది. వారిలో అక్షరాస్యత 49% మాత్రమే ఉంది. ట్రైబల్ మహిళల్లో అది మరింత తక్కువగా 39% మాత్రమే ఉంది.
గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా గిరిజన ఆదివాసీలకు ప్రయోజనం కలుగుతుంది. రూ. 889 కోట్ల తో యూజీసీ ద్వారా కేంద్ర విద్యాశాఖ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. ములుగులో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీ తో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా లాభం ఉంటుంది. మొదటి ఫేస్ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. గిరిజనుల హక్కులు, ఆచారాలు, సంస్కృతిని కాపాడేందుకు ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అడవుల మీద ఆధారపడే ఆర్థిక విధానాల మీద కూడా యూనివర్సిటీ దృష్టి ఉంటుంది. 30% పైగా గిరిజన జనాభా ఉన్నా ములుగు జిల్లాలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు అవుతోంది. ఈ జిల్లాలో వనదేవతలుగా పేరొందిన సమ్మక్క సారక్క పేరు మీద యూనివర్సిటీకి నామకరణం చేయడం వారిసెంటిమెంట్ ను గౌరవించడమే.. ఈ నిర్ణయంపై యావత్ హిందూ సమాజం స్వాగతిస్తోంది. లక్షలాది మంది గిరిజన, గిరిజనేతరులు సమ్మక్క సారక్కను పూజిస్తారు.
నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు కోసం రైతులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కొందరు బోర్డు ఏర్పడే వరకు పాదరక్షలు ధరించబోమని చెప్పారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 3.24 లక్షల హెక్టార్ల లో పసుపు సాగు చేస్తూ, 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతుంది. ప్రపంచంలోనే 75% పసుపు భారత్ లో ఉత్పత్తి అవుతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో, ఆ తర్వాత తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో సాగు అవుతుంది.
ప్రపంచ వాణిజ్యంలో పసుపు ట్రేడ్ లో 62% వాటా కలిగి ఉంది. భారత్ నుంచి అనేక ప్రపంచ దేశాలకు పసుపు ఎగుమతి అవుతోంది. ఆయుర్వేదంలో పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సకల రోగాలకు పసుపు వాడతాం. అనేక వేల ఏళ్ల నుంచి పసుపు వినియోగం ఉంది. ఔషధంగా కూడా వినియోగిస్తారు. సౌందర్య సాధనంగా పసుపు వినియోగం ఉంది. సహజ రంగుగా కూడా దీన్ని వాడతారు.
పసుపు బోర్డు ద్వారా పంట సాగు, దిగుబడి, వినియోగం, ఎగుమతి, మార్కెట్ లో ఎన్నో రకాల లబ్ది చేకూరుతుంది. రైతుల నైపుణ్యాలు పెంచడం కూడా బోర్డు ఏర్పాటు ద్వారా సాధ్యపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా పసుపు సాగు చేసేలా బోర్డు తోడ్పడుతుంది.
ఆయుష్ మినిస్ట్రీ తో కలిసి ఆరోగ్య ఉపయోగాల గురించి ప్రచారం చేయవచ్చు.. పసుపు మీద పరిశోధనలు, డాక్యుమెంటేషన్ కూడా బోర్డు ఏర్పాటుతో సాధ్యపడుతుంది. స్పైస్ బోర్డుతో అనుసంధానం చేసుకుంటూ ఈ సంస్థ పనిచేస్తోంది. వివిధ శాఖల నుంచి ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. వాణిజ్య శాఖ ఈ బోర్డును ఏర్పాటు చేసి, నిర్వహిస్తుంది. నిధుల కొరత ఉండదు. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తాయి. బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తామన్నది నిర్ణయం తీసుకోలేదని.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.