హైదరాబాద్,సెప్టెంబర్22(ఆంధ్రపత్రిక): హెచ్సీఏ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రశ్నేలేదని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు, ఇతరత్రా నాయకులు టిక్కెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారన్న వార్తల్ని ఖండిరచారు. టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నారన్న అంశంపై దృష్టి పెట్టామని, పోలీసు, శాట్స్ అధికారులతో నిఘా ఉంచామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, హెచ్సీఏ ఛైర్మన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్సీఏ సమన్వయ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రి ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల లోపం లేదని సమర్థించారు. జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో సవిూక్ష నిర్వహించారు. అజారుద్దీన్, సీపీ మహేష్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు ఈ సవిూక్షలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక జరగనున్న రెండో మ్యాచ్ ఇది అని, కరోనా తర్వాత జరిగే మ్యాచ్ అయినందున డిమాండ్ ఎక్కువగా ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్నదే అందరి ఉద్దేశమన్నారు. పెద్ద ఈవెంట్ కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని మంత్రి తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణకు పేరు తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడిరచారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మ్యాచ్ బాగా జరిగితే మరిన్ని మ్యాచ్లు తెలంగాణకు వస్తాయని వివరించారు. క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే అవకాశాలు ఇవ్వడంలోనూ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. టిక్కెట్లు బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్ నిర్వహణలో పోలీసుల వైఫల్యం లేదని మంత్రి తెలిపారు. హెచ్సీఏ సమన్వయ లోపం వల్లే ఘటన జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగవని హెచ్సీఏ హావిూ ఇచ్చిందని తెలిపారు. టిక్కెట్లు ఆలస్యంగా ఆఫ్లైన్లో అందుబాటులోకి తీసుకురావడంతో సమస్య ఏర్పడిరదని వివరించారు. దీనిపై హెచ్సీఏ ఛైర్మన్ అజారుద్దీన్ స్పందించారు. ఏం జరిగిందనే అంశంపై నివేదిక అందిస్తామని వెల్లడిరచారు. లోపాన్ని సవరించుకుం టామని తెలిపారు. తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమన్న అజారుద్దీన్… తెలంగాణకు మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్సీఏ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మ్యాచ్ నిర్వహణ చాలా అంశాలతో కూడుకున్నదని అన్నారు. కూర్చుని మాట్లాడుకునేంత సులభం కాదన్నారు. ఏం జరిగిందనే అంశంపై నివేదిక అందిస్తాం. లోపాన్ని సవరించుకుంటాం. మ్యాచ్ నిర్వహణ చాలా అంశాలతో కూడుకున్నది. కూర్చుని మాట్లాడుకునేంత సులభం కాదు. ఈరోజు నేనున్నా, రేపు మరొకరు ఉంటారు, అందరి ఆలోచనే ఒక్కటే. తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడిరపచేయడమే లక్ష్యం అని అజారుద్దీన్ అన్నారు. చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్ నిర్వహించుకునే అవకాశం వచ్చిందని అజారుద్దీన్ అన్నారు. మ్యాచ్ నిర్వహించే అవకాశం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడిరచారు. మ్యాచ్ నిర్వహణను ఎప్పుడూ నెగిటివ్ కోణంలో చూడవద్దని సూచించారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏవిూ చేయలేరని వెల్లడిరచారు. బాధితులకు హెచ్సీఏ అండగా
ఉంటుందని హావిూ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్ల నిర్వహణ ఉంటుందని తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!