Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్(103) అజేయమైన సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి..
తాజా వార్తలు
క్రికెట్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
వెబ్ స్టోరీస్
జాతీయం
పాలిటిక్స్
క్రైమ్
ట్రెండింగ్
లైఫ్ స్టైల్
బిజినెస్
హెల్త్
టెక్నాలజీ
ఆధ్యాత్మికం
అంతర్జాతీయం
ఎన్నికలు
#IPL2023TS SSC ResultsTS Inter ResultsAP 10th Class Results#Jobs#Weather#CMKCR#PMModi#DelhiLiquorPolicyCase#Money9#CoronaTracker#FuelTracker#GlobalIndians
Search ..
తాజా వార్తలు
వెబ్ స్టోరీస్
ఎంటర్టైన్మెంట్
హ్యుమన్ ఇంట్రెస్ట్
రాశి ఫలాలు
ఆధ్యాత్మికం
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడలు
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
హెల్త్
కెరీర్ & ఉద్యోగాలు
అంతర్జాతీయం
ఫోటో గ్యాలరీ
వీడియోలు
సైన్స్ అండ్ టెక్నాలజీ
లైఫ్ స్టైల్
ఎన్నికలు – 2023
విశ్లేషణ
మనీ 9
బడ్జెట్ 2023
CWG
Telugu News » Sports » Cricket news » IPL 2023: Rohit Sharma hits 200th six for Mumbai Indians and breaks AB devilries’ record
MI vs GT: ముంబై తరఫున రోహిత్ శర్మ ‘డబుల్ సెంచరీ’.. ఇంకా ఆ లిస్టులో ధోని, డివిలియర్స్ కంటే పైకి..
శివలీల గోపి తుల్వా | Updated on: May 12, 2023 | 10:20 PM
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్(103) అజేయమైన సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి..
MI vs GT: ముంబై తరఫున రోహిత్ శర్మ ‘డబుల్ సెంచరీ’.. ఇంకా ఆ లిస్టులో ధోని, డివిలియర్స్ కంటే పైకి..Rohit Sharma
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్(103) అజేయమైన సెంచరీతో కదం తొక్కడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ముంబై తరఫున 200 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా కూడా అవతరించాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్లలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ మూడు సీజన్ల తర్వాత 2011లో ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ముంబై తరుపున ఆడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్‌గా 5 సార్లు ముంబైని టోర్నీ చాంపియన్‌గా నిలిపాడు. ఇక నేటి మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు అంతకముందు ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(251) పేరిట ఉండేది. ఇక రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 252 సిక్స్‌లు కొట్టాడు. అలాగే ఈ జాబితాలో ఆర్సీబీ మరో మాజీ ఆటగాడు క్రిస్‌గేల్(357) అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే ఏబీ డివిలియర్స్ ఇప్పుడు 3వ స్థానంలో.. చెన్నై టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని(239) నాల్గో స్థానంలో ఉన్నాడు.కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో 219 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే కష్టాలను ఎదుర్కొంటోంది. 7 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కొల్పోయి 55 పరుగులతో ఉంది. ఇక క్రీజులో గుజరాత్ తరఫున అభినవ్ మనోహర్(2), డేవిడ్ మిల్లర్(10) ఉన్నారు.