నరసాపురం మొగల్తూరు ఆగస్టు 31 (ఆంధ్ర పత్రిక ):
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలో స్థానిక దస్తావేజుల లేఖర్లు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కూడా పెన్‌డౌన్ సమ్మె కార్యక్రమం సంఘ అధ్యక్షులు కొల్లాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యులు నిర్వహించారు. సమ్మె శిబిరం వద్ద సంఘ అధ్యక్షుడు కొల్లాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆస్తులు అమ్ముకున్న వ్యక్తుల నుండి కొనుగోలు చేసిన వ్యక్తులకు ఒరిజినల్ రికార్డులు లేకుండా చేయడమేనని కార్డు ప్రేమ్ విధానం వల్ల కేవలం ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రభుత్వము దస్తావేజు రిజిస్ట్రేషన్ లో ప్రక్రియ కార్ట్ ప్రేమ్ 2. ఓ విధానం అమలు చేయడం వల్ల దస్తావేజు లేఖర్లకు, స్టాంపు అమ్ముకునేవారికి చాలా ఇబ్బంది ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్డ్ ప్రేమ్ 2 ఓ విధానమును తక్షణం రద్దు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. పాత పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని ఆయన కోరారు. దస్తావేజులేఖర్లకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేయాలని, లేఖర్ల జీవనోపాధి కల్పించే పాత పద్ధతులను కొనసాగించాలని ఆయన కోరారు. తమ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 30 31 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమం తో నిరసన తెలియజేయాలని కోరడంతో తామంతా స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లేఖల సంఘ నాయకులు బొక్క గంగాధర్ రావు, వి . కిరణ్, ఆదూరి సత్యనారాయణ, పట్టపురాము, గుండు నాగేంద్ర కుమార్, తోము కృష్ణమోహన్, దొంగ రాజేశ్వరరావు, బి రాజేష్ లకు శ్రీనివాస్, కడలి చంద్రశేఖర్, పొన్నపల్లి జయసుధ, సిహెచ్ శైలజ తదితరులు పాల్గొన్నారు.