అమరావతి,నవంబర్23(ఆంధ్రపత్రిక): తెదేపా అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారత్లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీని ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జీ-20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!